Search
Wednesday 17 October 2018
  • :
  • :

‘హైదరాబాద్‌ సుందరి గౌరీప్రియ’

Miss Hyderabad-2018 winner Gauri Priya

హైదరాబాద్: ‘మిస్ హైదరాబాద్-2018’ పోటీలు బుధవారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో అంగరంగా వైభవంగా జరిగాయి. 24 మంది యువతులు పోటీ పడగా గౌరీప్రియకు ‘మిస్‌ హైదరాబాద్‌’ టైటిల్ దక్కింది. ఫస్ట్‌ రన్నరప్‌గా అషిమా గౌతం, సెకండ్‌ రన్నరప్‌గా రియా సింగ్‌ నిలిచారు. ఆద్యంతం ఆకట్టుకున్న ఈ పోటీల్లో కిరీటం కోసం 24 మంది అందగత్తెలు ర్యాంప్ పై హోయలొలికించారు. పోటీదారులు చివరివరకు నువ్వా నేనా అనే విధంగా పోటీపడ్డారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

వివిధ విభాగాల కోసం సాగిన పోటీల్లో డిజైనర్లు రూపొందించిన వస్త్రాల్లో మోడళ్లు మెరిసిపోయారు. ట్రేండ్స్ ‘మిస్‌ హైదరాబాద్‌’ అందాల సుందరి ఎవరని నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ప్రతి విభాగంలో అమ్మాయిల అందచందాలు, అభినయం, ఆహార్యం, తెలివితేటలు తదితర అంశాలను న్యాయనిర్ణేతలు పరీక్షించారు. తమ అందంతో పాటు వివిధ అంశాల్లో సుందరాంగులు తమ ప్రతిభను ప్రదర్శించారు. తుదిపోరుకు 24 మంది యువతులు ఎంపికవ్వగా తొలి రౌండ్ లో 10 మందిని సెలక్ట్ చేశారు. వీరిలో ఐదుగురిని ఫైనల్స్ కు ఎంపిక చేసి, చివరికి ముగ్గురిని విజేతలుగా ప్రకటించారు. వీరికి అందంతో పాటు భావవ్యక్తీకరణ, సమయపాలన, ఆత్మవిశ్వాసం వంటి అంశాల్లో న్యాయనిర్ణేతలు పరీక్షించారు. చివరకు గౌరీప్రియ ‘మిస్‌ హైదరాబాద్‌-2018’ టైటిల్ గెలుచుకుంది.

Miss Hyderabad-2018 winner Gauri Priya.

Comments

comments