Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

మిస్ ఇండియా బెస్ట్ టైటిల్ సాధించిన మాధురి

                      Miss-India-Title

జ్యోతినగర్: నాటి ఇంటర్ నేషనల్  ఫిల్మ్ సొసైటీ (ఎన్‌ఐఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ముంబైలో నిర్వహించిన మిస్ ఇండియా పోటీలలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు చెందిన ఉద్యోగి మోహన్ కుమార్తె సిహెచ్. మాధురి మిస్ ఇండియా బెస్ట్ టైటిల్‌ను సాధించినట్లు ఆమె తండ్రి మంగళవారం స్థానిక విలేఖరులకు తెలిపారు. ఈనెల 22న ముంబైలో నిర్వహించిన మిస్ ఇండియా కాంపిటీషన్‌కు తెలంగాణ నుండి పోటీలో పాల్గొన్న సిహెచ్. మాధురికి బెస్ట్ పర్సనాలిటీ టైటిల్‌ను దక్కించుకొని నాలుగవ స్థానంలో నిలిచిందని తెలిపారు.

పోటీలకు దేశంలోని పలు రాష్ట్రాల నుండి అనేక మంది పాల్గొనగా మాధురికి టైటిల్ లభించడం పట్ల తండ్రి మోహన్, తల్లి వసుంధరలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా మాధురి ఇప్పటికే బుల్లితెరపై జెమిని టీవిలో ప్రసారమవుతున్న శ్రావణసమీరాలు సీరియల్‌లో దీపా పాత్రలో నటించిందని, వీటితో పాటు తమిళ, మలయాళం టీవి సీరియల్‌లో కూడా నటిస్తుందని వివరించారు.

ఎన్టీపీసీ రామగుండం సెయింట్ క్లేర్ హై స్కూల్‌లో పదవ తరగతి వరకు చదివి ఇంటర్మీడియట్ కరీంనగర్ ఆల్ఫోర్ కళాశాలలో పూర్తి చేసిందని, డిగ్రీ కూడా కరీంనగర్‌లోని వివేకానంద కళాశాలలో చేదివిందని, బి.ఈడి ఆల్ఫోర్స్‌లో చదివి, యంఎస్‌సి హైదరబాదులోని అవంతి కళాశాలలో చదివిందని తల్లిదండ్రులు తెలిపారు. మాధురికి చిన్ననాటి నుండే నటన పట్ల ఆసక్తి కనబరిచేదని, ఈక్రమంలోనే టీవి సీరియల్‌లలో అవకాశం రావడంతో బుల్లితెర నటిగా కొనసాగుతున్నది. తండ్రి ఎన్‌టిపిసిసిలో ఇంజనీర్‌గా, తల్లి పొట్యాల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది.

Comments

comments