Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గురి తప్పిన ఉత్తర కొరియా క్షిపణి

korea

2017లో సాంకేతిక లోపంతో టోక్చోన్ నగరం వైపు దూసుకెళ్లిన క్షిపణి
కుప్పకూలిన వ్యవసాయ క్షేత్రాలు, భవనాలు

ప్యాంగ్యాంగ్ : అనేక దేశాలు ఎంత హెచ్చరిస్తున్నా తీరు మార్చుకోకుండా వరుసగా క్షిపణి, అణు ప్రయోగాలకు పాల్ప డుతున్న ఉత్తర కొరియా.. 2017 ఏప్రిల్‌లో పొరపాటుగా తమ నగరంపైనే క్షిపణిని ప్రయోగించిందట. ఈ విషయాన్ని అమెరికాకి చెందిన ఓ అధికారి ‘ది డిప్లొ మాట్’ అనే ఆంగ్ల పత్రికకు బుధవారం వెల్లడిం చారు. ఇటీవల ఉత్తర కొరియా హ్వాసాంగ్-12 అనే బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్టు తెలి పింది. సాంకేతిక లోపం కారణంగా ఆ క్షిపణి ఉత్తర కొరియా లోని టోక్చోన్ అనే నగరం మీదు గా దూసుకెళ్లింది. ఆ నగరం లో సుమారు రెండు లక్షల మంది జనాభా ఉన్నారు. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కి 40 కిలోమీటర్లు దూరం లో ఉన్న ఎయిర్ ఫీల్ నుంచి కొరియా ఈ క్షిపణిని ప్రయో గించిందట. దాంతో ఆ నగరం లోని వ్యవసాయ క్షేత్రాలు, భవనాలు కుప్ప కూలి పోయినట్లు శాటిలైట్ దృశ్యాల్లో కన్పిం చింది. అయితే క్షిపణి ప్రయోగం కారణంగా టోక్చోన్‌లో ఎలాంటి ప్రాణ హాని జరగలేదు. ఎలాగూ క్షిపణి విఫలమైంద ని తెలియడంతో అమెరికా ప్రభుత్వం దీని గురించి చర్చించ లేదు. ఒకవేళ క్షిపణి విజయవంతమై ఉంటే జపాన్ మీదుగా దూసు కెళ్లేది. ఉత్తర కొరియా 2017 ఆగస్టు, నవంబరులో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మరో రెండు వారాల్లో ఉ.కొరియా మరో క్షిపణిని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు అమెరికన్ ప్రతి నిధులు తెలిపారు. మరోపక్క అణు ప్రయోగాల విషయంలో అమెరికా, ఉ.కొరియా మధ్య మాట ల యుద్ధం జరుగుతోంది. ‘అణు బటన్ ఎప్పుడూ నా టేబుల్ మీదే ఉంటుంది’ అంటూ ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి అమెరికా అధ్య క్షుడు దీటుగా సమాధానమిస్తూ..‘నా అణు బటన్ కూడా బాగానే పనిచేస్తుంది. అది ఉ.కొరియా కంటే పెద్దది’ అన్నారు.

Comments

comments