Home రాష్ట్ర వార్తలు ఆక్టోపస్ ఆఫీస్‌లో మిస్‌ఫైర్

ఆక్టోపస్ ఆఫీస్‌లో మిస్‌ఫైర్

సెంట్రీ కానిస్టేబుల్ మృతి

miss-fireసిటీబ్యూరో: హైదరాబాద్ బేగం పేట్‌లోని ఆర్గనైజేషన్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం ప్రివెంటివ్ అపరేషన్ (అక్టోపస్) కార్యాలయంలో మిస్‌ఫైర్ జరిగింది. గన్ శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో సెంట్రీ డ్యూటీలో ఉన్న కానిస్టే బుల్ తలలోకి బుల్లెట్   దూసుకెళ్లింది. విషయం గమనించిన తోటి సిబ్బంది అతడిని ఆసుపత్రికి తర లించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం చో టుచేసుకుంది. పంజగుట్ట ఇన్‌స్పెక్టర్ మోహన్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన శివకుమార్ చారి (25)కి తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. 201౩లో పోలీసు శాఖలో చేరాడు. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీసు 13వ బెటాలియన్(మంచిర్యాల)లో కానిస్టేబుల్‌గా ఉన్నాడు. డిప్యుటేషన్‌పై అక్టోపస్ విభాగానికి ఇటీవలే బదిలీ అయ్యాడు. బేగంపేట్‌లోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న ఉగ్రవాద దాడుల నిరోధక సంస్థ అయిన అక్టోపస్ కార్యాలయంలో సెంట్రీ డ్యూటీ చేస్తున్నాడు. ఇటీవలే సెలవుపై ఊరికెళ్లిన శివకుమార్‌చారి శనివారం నగ రానికి తిరిగి వచ్చాడు. అక్టోపస్ క్వార్టర్స్‌లోనే నివాసముంటున్న శివకుమార్‌కు ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు సెంట్రీ డ్యూటీ పడి ంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం 4 గంటలకు డ్యూటీకి ఎక్కాడు. సాయంత్రం 6 గంటల సమయంలో డ్యూటీ దిగుతున్న సందర్భంలో తన గన్‌ను శుభ్రం చేసుకుంటున్నాడు.
ఒక్కసారిగా స్టిగర్‌పై చేయ్యి పడడంతో గన్ ఒక్క సారిగా మిస్‌ఫైర్ అయ్యింది. అందులోంచి బయటికి వచ్చిన బుల్లెట్ అతని తల లోకి దూసుకెళ్లింది. గన్ పేలిన శబ్దం రావడంతో అక్టోపస్ కార్యాలయంలో ఉన్న మిగతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే కుప్పకూలిపోయిన శివకుమార్‌ను వెంటనే సికింద్రాబాద్‌లోని యశోధ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ శివకుమార్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని అక్టోపస్ అదనపు డిజి గోవింద్ సింగ్ పరిశీలించారు. మిస్‌ఫైర్ ఎలా జరిగిందో ఆరా తీశారు. మిస్‌ఫైర్‌పై అక్టోప స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని నిమ్స్ మార్చురికి తరలించారు. శివకుమార్‌చారికి అక్కాచెల్లులు ఉన్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు బయల్దేరారు.