Home అంతర్జాతీయ వార్తలు ‘ వారి ప్రాణాలు తీసింది … రష్యా క్షిపణే…’

‘ వారి ప్రాణాలు తీసింది … రష్యా క్షిపణే…’

Missile destroys Malaysia Airlines plane over Ukraine, killing 298 people

2014లో ఉక్రెయిన్‌లోని తూర్పు ప్రాంతంలో మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777ను కూల్చేయడానికి రష్యాకు చెందిన క్షిపణిని ఉపయోగించినట్టు అంతర్జాతీయ దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై నెదర్లాండ్స్‌కు చెందిన ఓ బృందం దర్యాప్తు చేసి ఈ విషయాన్ని తేల్చింది. రష్యాలోని కుర్స్క పట్టణంలోని రష్యాకు చెందిన 53వ పటాలం నుంచి ఈ విమానాన్ని కూల్చేందుకు బక్ క్షిపణి వచ్చిందని దర్యాప్తు బృందం పేర్కొంది. ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్ వెళుతున్న ఈ విమానాన్ని పేల్చేసిన ఘటనలో 298 మంది చనిపోయారు. అయితే ఈ విమానాన్ని తాము కూల్చలేదని నాడు రష్యా చెప్పింది. రష్యానే ఈ విమానాన్ని కూల్చేసిందన్న దర్యాప్తు బృందం చెప్పిన విషయాన్ని రష్యా ఖండించింది. ఈ దర్యాప్తు నివేదికను తాము ఆమోదించబోమని రష్యా ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. దర్యాప్తు బృందం రష్యాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా చూపలేదని ఆయన పేర్కొన్నారు.

Missile destroys Malaysia Airlines plane over Ukraine, killing 298 people