Home లైఫ్ స్టైల్ వైమానిక విభాగ డిజిగా మిస్సైల్ ఉమెన్ టిస్సి థామస్

వైమానిక విభాగ డిజిగా మిస్సైల్ ఉమెన్ టిస్సి థామస్

life

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు.  చదువు, ఆటలు,సినిమా, సాంకేతిక రంగాల్లో అన్నిటా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇతరులపై ఆధారపడకుండా కష్టపడి తమ సత్తా నిరూపించుకుంటున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే  ఉన్నత స్థాయికి ఎదిగిన థామస్ గురించి తెలుసుకుందాం.

మన దేశ క్షిపణి ప్రాజెక్టుకు ఎంపికైన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త టెస్సి థామస్. కేరళలోని అలప్పుజలో 1963లో జన్మించింది. విద్యాభ్యాసం అంతా అలెప్పీలోనే జరిగింది. చిన్నప్పటి నుండి గణిత, భౌతిక శాస్త్రాలంటే థామస్‌కి మక్కువ. మేథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకునేది. త్రిస్సూర్ గవర్నమెంట్ కాలేజీలో బిటెక్ కోసం ఎస్‌బిఐ నుండి లోన్ తీసుకుని హాస్టల్‌లో చదువుకుంది. పాఠశాల, కళాశాలల్లో చదువుకునే రోజుల్లోనే ఖాళీ సమయాల్లో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనేది. బ్యాండ్మింటన్ లాంటి క్రీడల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పూణెలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎం.టెక్ పూర్తి చేసింది.
థామస్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వైమానిక విభాగం ప్రధాన సంచాలకురాలుగా నియమితులయింది. సాంకేతిక స్థాయిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ స్థాయికి ఎదిగిన మహిళల్లో మూడవ స్థానంలో ఉంది.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబరేటరీస్ సంచాలకురాలుగా సేవలందిస్తోంది. హైదరాబాదులోని క్షిపణి సముదాయం నుంచి బెంగళూరులోని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) సముదాయంలోకి మారనుంది. మే 31న పదవీ విరమణ చేయనున్న డాక్టర్ సి.పి.రామనారాయణన్ బాధ్యతలను ఈమె చేపట్టనుంది. క్షిపణుల తయారీ పథకాలకు సారథ్యం వహించిన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఇప్పటికే మంచి పేరు గడించింది.
థెరిస్సా 13ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తండ్రి పక్షవాతంతో బాధపడ్డారు. ఉపాధ్యాయురాలిగా పనిచేసిన ఆమె తల్లి కుటుంబ పరిస్థితుల రీత్యా ఇంట్లోనే ఉండిపోయారు. థామస్ బాల్యం అంతా తుంబ రాకెట్ లాంచింగ్ స్టేషన్ దగ్గరే గడిచింది. అక్కడే రాకెట్స్, మిస్సైల్స్‌తో ఎక్కువ సమయం గడిపేది. విమానం ఎగిరేటప్పుడు ఎంతో ఉత్సాహంగా వాటిని గమనించేది.
కేరళలోని అందమైన వాతావరణంలో నేను పెరిగాను. అందమైన, బలమైన ఆలోచనలు రావడానికి ప్రకృతి ఎంతో సహకరిస్తుంది అని ఆమె చిన్ననాటి అనుభవాలను పంచుకుంది. డిఆర్‌డిఏ కింద ఉన్న క్షిపణి మార్గదర్శకంగా ఆపరేషన్ మేనేజ్‌మెంట్, పి హెచ్. డిలో ఎంబిఎ చదివింది. 1988లో డిఆర్‌డిఏలో చేరింది. నూతన క్షిపణి అగ్ని రూపొందించడం, దానిని అభివృద్ధి చేసే విభాగంలో నియమితురాలైంది. మాజీ రాష్ట్రపతి డా॥ ఎపిజె అబ్దుల్ కలామ్ ఈమెని అగ్ని క్షిపణి విభాగంలో నియమించారు.
3,000 కి.మీ. అగ్ని 3 క్షిఫణి ప్రాజెక్టులో ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్నారు. 2011లో అగ్ని4 విజయవంతంగా పరీక్షింపబడింది. ఈమె అగ్ని4 కి ప్రాజెక్టు డైరెక్టరుగా వచ్చింది. 2009లో 5000 కి.మీ. విభాగంలో ప్రదర్శింపబడిన అగ్ని5కి ప్రాజెక్టు డైరెక్టర్‌గా నియమితులయింది. 2012 ఏప్రిల్ 19న నిర్వహించిన ఈ పరీక్షలు విజయవంతమయ్యాయి.
ఇండియన్ నేషనల్ ఎకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్(ఐఎన్‌ఎఇ), ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్‌ఇండియా(ఐఇఎ), టాటా ఎడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ విశ్వవిద్యాలయాలలో ఒక సభ్యురాలిగా ఉంది.
థెరిస్సా భారతీయ నౌకాదళంలో కమాండర్ అయిన సరోజ్ కుమార్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు తేజాస్. క్షిపణి సాంకేతిక రంగంలో థామస్ స్వయంగా చేసిన కృషికి లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.