Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

దుర్గగుడిలో అదృశ్యమైన చిన్నారి

Missing Child In Vijayawada Durga Temple

విజయవాడ : దుర్గగుడిలో ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. తమ ఐదేళ్ల కూతురు నవ్యశ్రీ తప్పిపోయిందని తల్లిదండ్రులు  ఆలయ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా.. సిసి కెమెరాలు పని చేయడం లేదని నిర్లక్ష్య సమాదానం చెప్పారని వాపోయారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ సమాచార కేంద్రంలో నవ్యశ్రీని అప్పగించక పోవడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారి ఆచూకీ కోసం నగర వ్యాప్తంగా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌లలో, తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగొస్తున్నారు. ఇప్పటికీ చిన్నారి ఆచూకీ దొర‌క్కపోవ‌డంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.  పోలీసులు సిసి కెమెరాల్లో పరిశీలించగా గుర్తు తెలియని మహిళ నవ్యశ్రీ ను తీసుకెళుతున్న దృశ్యాలు  రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా చిన్నారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. సిసి టివి పుటేజిలో ఉన్న మహిళ పాపను కిడ్నాప్ చేసిందా అనే కోణంలో పోలీసులు  దర్యాప్తు ప్రారంభించారు.

Comments

comments