Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ భేష్

Mission Bhagiradha Works In Sangareddy District

మన తెలంగాణ/పుల్‌కల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ సురక్షితమైన తాగు నీటిని అందించడానికి సంగారెడ్డి జిల్లా పుల్‌కల్ మండలంలోని పెద్దారెడ్డిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వాటర్‌గ్రిడ్ పథకాన్ని మంగళవారం తాగు నీటి శాఖ, పారిశుద్ధ్య శాఖ కేంద్ర మంత్రి రమేష్‌చంద్రప్ప జిగజీనాగీ పరిశీలించారు. ఆయనకు తెలంగాణ తాగునీటి శాఖ అధికారులు మిషన్ భగీరథ ప్లాంటు వివరాలను తెలియజేశారు. సింగూర్ ప్రాజెక్ట్‌ను సందర్శించిచారు. ప్రాజెక్ట్‌లో ఉన్న నీటి నిల్వలను, ప్రాజెక్ట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగూర్ నీటిపారుదల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు సురక్షిత మంచినీటిని ఇంటింటికీ నల్లాలను ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావ్‌కు అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజల కోసం సిఎం కెసిఆర్ నిర్వహిస్తున్న పనులకు పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలియజేయక తప్పదన్నారు. ఇలాంటి గొప్ప పథకాలను దేశంలో ప్రతి రాష్ట్రలో నిర్మించే విధంగా రూ.5లక్షల కోట్లతో పథకం రూపకల్పనకు ఇప్పటికే ఉన్నాతధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. స్వచ్ఛ భారత్ మహాత్మగాంధి కన్న కల అని అభివర్ణించారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆకలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. జాతీయ గ్రామీణ తాగు నీటి ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణకు 2015 నుండి ఇప్పటి వరకు రూ.1121.26 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇందులో రూ.999.71కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాలలో 100శాతం పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపా రు. 33.01శాతం ప్రజలకు ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో జాతీయ గ్రామీణ తాగు నీటి పథకం ద్వారా 252 పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎల్‌అండ్‌టి అధికారులు పాల్గ్గొన్నారు.
మునిపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతన్న మిషన్ భగీరథ పథకం అద్భుతమని, ప్రభుత్వం చేపడుతున్నపథకాలు దేశానికే ఆదర్శమని కేంద్ర నీటిరుదల, పారిశుద్ధ శాఖా మంత్రి రమేష్ చందప్ప జగజినాగి పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని బుసారెడ్డిపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ ఇంటెక్ వెల్‌ను పరిశీలించారు. అనంతరం హరితహార కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ఆవరణలో మొక్కలు నాటి ఆ ప్రాంతంలో కలియ తిరిగారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు భారత దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇలాంటి పథకాలను ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రవే శ పెట్టేలా చూస్తామన్నారు. భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్‌తో త్రాగునీరు అందించడంపై హర్షం వ్యక్తం చేశారు. అలాగే రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పు రెండు దఫాలుగా రూ.8వేలు అందించడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఇదే కాకుండా తెలంగాణకు హరితహా రం అనే కార్యక్రమం చేపట్టడం గర్వించదగ్గ విషయమన్నారు. సిఎం కెసిఆర్ చేపడుతున్న పథకాలు ఎంతో బాగున్నాయని అభివర్ణించారు. ఆయన వెంట జిల్లా, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.

Comments

comments