Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ మంచి పథకాలు

governor

*మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కితాబు

మనతెలంగాణ/సిరిసిల్ల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ మంచి పథకాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు కితాబిచ్చారు.సోమవారం ఆయన సిరిసిల్లలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని అన్నారు.రాజకీయాలకతీతంగా మంచి పనులు ఎవరు చేసినా సమర్థించాలన్నారు. సామాజిక తెలంగాణ కోసం కెసిఆర్ కృ షి చేస్తున్నారని ఉద్యమ సమయంలో తిరిగిన అనుభవాల వల్ల అణగారిన వర్గాలకు అధికారం అందించాలని కెసిఆర్ కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో 80 శాతం మంది  నిమ్నజాతుల ప్రజలు ఉన్నారన్నారు. సుప్రీం కోర్టు 50 శాతానికి మంచి రిజర్వేషన్లు ఉండరాదని ఆదేశించినప్పటికి తెలంగాణ లాంటి ప్రాంతాల్లో రిజర్వేషన్లు ఎక్కువగా అవసరమని ఇప్పటికే తమిళనాడులో 50శాతాన్ని మించి రిజర్వేషన్లు ఉన్న విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచ తెలుగు మహాసభలు జరిపి ఎంతో మంచిపని చేశారన్నా రు. సామాజిక స్పృహతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. భాషా సంస్కృతుల అభివృద్దికి కెసిఆర్ కృషిచేస్తున్నారన్నారు.పార్టీలకతీతంగా అభివృద్ధి పనులకు అందరూ సహకరించాలన్నారు. మంచి ప్రభుత్వమే కాకుండా మంచి ప్రతిపక్షం కూడా ఉందన్నారు. సా మాజిక తెలంగాణ సాధనకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అభినందించారు. సాహిత్యాభివృద్దికి కూడా జరుగుతున్న కృషిని ప్రశంసించారు.

Comments

comments