Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

పల్లె చెరువుకు ఇక మహర్దశ

Mission Kakateeya Works Doing In Malle Cheruvu

మనతెలంగాణ/రామాయంపేట : మల్లె చెరువుకు మహర్దశ రానుంది…ఏళ్ల కాలం నుంచి మురికి నీటితో నిండి దుర్వాసన వెదజల్లిన చెరువు ఇక పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచనుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయలో   భాగంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కృషితో  దీన్ని మినీ ట్యాంక్ బండ్‌గా మార్చనున్నారు…ఇందుకుగాను 3కోట్ల19లక్షల రూపాయలు మంజూరి కాగా ఆదివారం నాడు ఇట్టి పనులు భారీ నీటిపారుదల శాఖా మంత్రి తన్నీర్ హరీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి. రామాయంపేట పట్టణంలోని సిద్దిపేట రోడ్ ప్రక్కన మల్లె చెరువు ఉంది.ఇది ఒక నాడు పశు,పక్షాదులకు త్రాగునీటిని అందించింది.పట్టణ ప్రజలు సైతం ఇందులో బట్టలు ఉతకడంతోపాటు స్నానాదులు సైతం చేసేవారు.కాల క్రమేనా పట్టణం విస్తరించడంతో మురికి కాలువులు అన్నిఇందులోకి రావడం మూలంగా నీరంతా కలుషితం అయ్యింది.దీంతో నిత్యం పచ్చ రంగులోకి ఉండి దుర్వాస వెదజల్లుతుంది.ఆప్రాంతం నుంచి వెళ్లాలన్నా ముక్కు మూసుకుని పోవాల్సి దుస్థితి ఏర్పడింది.దీనికి తోడు ఈగలు ,దోమలకు ఆవాసంగా మారడంతో అక్కడి వన్నీ ఇళ్లలోకి ప్రజలపై దాడులు చేస్తుండంతో వారు అనేక రోగాల బారిన పడి ప్రజలు ఆసుపత్రుల పాలు అయిన ఘటనలు అనేకం ఉన్నాయి.దీనిపై గతంలో ఎన్ని సార్లు అధికారులకు,నాయకులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చెరువుల మరమ్మత్తుకు ప్రభుత్వం పూనుకుంది.మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్దరణలో భాగంగా మల్లె చెరువు అభివృద్దికి నోచుకోనుంది.గతంలో పేటకు వచ్చిన భారీ నీటి పారుదశాల శాఖ మంత్రి హరీష్‌రావు దీనిని మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు హామీ నిచ్చారు.ఈమేరకు నిధులను సైతం మంజూరి చేశారు. దీంతో ఆదివారం నాడు మంత్రి హరీష్‌రావు పేటకు చేరుకుని ఇట్టి మల్లె చెరువు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు.మరి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి,పేట ఎంపిపి పుట్టి విజయలక్ష్మిల కృషితో మల్లెచెరువు మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు అయితూ ఇక్కడి ప్రజల కష్టాలు తీరడంతో పాటు ,పట్టణ వాసులందరికి అహ్లాదం చేకూరనుంది.

Comments

comments