Home జిల్లాలు ‘ మిషన్ కాకతీయ ’తో చెరువులకు మహర్ధశ

‘ మిషన్ కాకతీయ ’తో చెరువులకు మహర్ధశ

trsగరిడేపల్లి: చెరువుల పునఃరుద్ధ్దరణ వల్ల రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్మల చెరువు రూ.80 లక్షలతో ఊరచెరువు పనులను ప్రారంబించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌కాకతీయ పథకంతో గ్రామీణ ప్రాంతాలలోని చెరువులకు మహర్ధశ పట్టనున్నదని ఆయన పేర్కొన్నారు. చెరువులలో పూడికతీయడం వల్ల నీటి సామర్ధం పెరిగి రైతులకు సాగునీరు, తాగునీరు అందుతుందని ఆయన తెలిపారు. చెరువులలో తీసిన సారవంతమైన మట్టిని రైతులు తమ పంటపొలాలకు ఉపయోగించుకుని అధిక దిగుబడులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇంచార్జి కాసోజు శంకరమ్మ, సాముల శివారెడ్డి,ఎంపిపి బీమపంగు సోమమ్మ, జెడ్‌పిటిసి శ్రీనివాస్‌గౌడ్, ఎంపిపి ఉపాధ్యక్షుడు సైదిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షులు ముత్యపోతుల కృష్ణ, సర్పంచ్ అంజయ్య, పోకల వెంకటేశ్వర్లు, శంబిరెడ్డి, శ్రీనివాస్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.