Home తాజా వార్తలు ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ : హరీశ్

ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయ : హరీశ్

harish-rao

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మిషన్ కాకతీయ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే మిషన్ కాకతీయను చేపట్టామని ఆయన తెలిపారు. వచ్చే ఏడాది మిషన్ కాకతీయ ఫేజ్-౩ చేపడతామని ఆయన పేర్కొన్నారు. తక్కువ వర్షపాతం పడినజిల్లాలో మూడో దశ పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. తక్కువ వర్షాపాతం నమోదైన మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఫేజ్-౩కి ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. టిడిపి సభ్యుడు రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు.