Search
Sunday 23 September 2018
  • :
  • :

ఊపందుకున్న మిషన్ కాకతీయ

రెండో విడత పనులు ప్రారంభం
మొదటి విడత పనులను పూర్తి
శర వేగంగా మినీ ట్యాంక్ బండ్ పనులు

Lake

మహబూబ్‌నగర్ ప్రతినిధి:మహబూ బ్‌నగర్ డివిజన్ ఇరిగేషన్ పరిధిలో మిషన్ కాకతీయ పనులు ఊపందుకుంటున్నాయి. వర్షాకాలం సమీస్తుం డడంతో మిషన్ కాకతీయ రెండో దశ పనులు ప్రారం భం కానున్నాయి. ఇప్పటికే టెండర్లు పూర్తి కావడంతో పనులు జూన్, జూలై లోగా పూర్తి కానున్నాయి. మొద టి దశ మిషన్ కాకతీయ పనులు పూర్తి కావడంతో ఈ ఏడాది ఆ చెరువుల్లోకి నీటి నిల్వలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిషన్ కాకతీయ పనులపై ఎంఎల్‌ఎ శ్రీనివా స్‌గౌడ్‌తో పాటు ఇరిగేషన్ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో పనులు వేగవంతం కానున్నాయి. మిషన్‌కాకతీయ కింద చెరువల్లో పూడిక తీయడం వల న నీటి నిల్వలు పెరగడమే కాకుండా ఆయికట్టు సాగు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడుత మిషన్ కాకతీయ  పథకం కింద  దాదాపు రూ.7 కోట్లు నిధులతో 65 చెరువులకు మిషన్ కాకతీయ పనులు మంజూరు అయ్యాయి.

వీటిలో ఒకటి తప్ప అన్ని పనులు పూర్తి అయ్యాయి. రెండ వ విడుత కింద 55చెరువులు మంజూరు అయ్యా యి.వీటికి టెండర్లు పూర్తి కావడంతో త్వరలో చెరువుల్లో పూడిక తీత పనులు ప్రారంభం కా నున్నాయి. వీటికి కూడా దాదాపు రూ. 6 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వర్షాకాలం సమీ స్తుండడంతో చెరువుల్లో పూడిక తీత పనులు పూర్తి అయితే పెద్ద ఎత్తున నీటి నిల్వలు పెరిగే అవకా శాలు ఉన్నాయి. మొదటి విడుత జరిగిన మిషన్ కాకతీయ పనుల్లో బాగంగా దాదాపు 4 లక్షల క్యూబెక్ మీటర్ల పూడికను తవ్వారు.దీనిని రైతులు తమ పంట పొలాలలకు వాడుకున్నారు. గత ఏ డాది వర్షాలు సంవృద్దిగా కురవక పోవడంతో కొ న్ని చెరువుల్లో నీటి నిల్వలు లేకుండా పోయాయి. మిషన్ కాకతీయ పనులకు బడ్జెట్‌లో ఎలాంటి సమస్య లేదని పనులు పూర్తి చేసిన వెంటనే నిధులు చెల్లిస్తున్నామని ఆ శాఖ డిప్యూటి డిఇ మన్మోహన్ తెలిపారు.

నిర్ణీత గడువులోగా మినీ ట్యాంక్ బండ్ పూర్తి : జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్‌గా పిలువబడే పెద్ద చెరువను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ చెరువు పనులు వేగవంతంగా జరుగుతున్నా యి. ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు , జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేక శ్రద్ద కనబర్చుతుండడంతో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2015లో నే మినీ ట్యాంక్ బండ్‌కు రూ. 6 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు రూ.2 కోట్లు నిధులు ఖర్చు అయ్యాయి. ప్రస్తుతం 3 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు వైండింగ్ బండ్, 2 అలు గులు,పూర్తి అయ్యాయి. మట్టికట్టపై రెండు సంవ త్సరాలు వర్షం కురవడం వలన క్యూరింగ్ పూర్తి కావడంతో ఇక మిగిలింది సిసి రోడ్లు వేయడం మాత్రమే మిగిలింది. ఇప్పటికే బండ్‌పై రక్షణ గోడల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ఇతర చిన్న చిన్న పనులు మిగిలాయి. ఇక గుర్రపు డెక్క ప్రధాన సమస్యగా మారింది.

గతంలో ఒక కాంట్రాక్టర్ గుర్రపె డెక్క తీయడానికి రూ. 27 లక్షల ఖర్చుపెట్టినప్పటికీ అది తీయడం సాధ్యపడలేదు. దీంతో ఆయనకు నోటీసులు జారీ చేశారు. రీ టెండర్లకు పిలవను న్నారు. గుర్రపు డెక్కను సమూలంగా తీయడానికి హైదరాబాద్ నుంచి టెండర్లను ఆహ్వానించే అవ కాశాలు ఉన్నాయి. అది పూర్తి అయితే వచ్చే ఈ ఏడాదిలోగా మినీ ట్యాంక్ బండ్ పూర్తి కానుంది. ఇదే పూర్తి అయితే ఆహ్లాదాన్ని పంచేందుక టూ రిజం శాఖ బోటింగ్‌లను ఏర్పాటు చేసే అవకా శాలు ఉన్నాయి.

Comments

comments