Home దునియా కాలంతో పోరాడుతున్న కల్వకోల్

కాలంతో పోరాడుతున్న కల్వకోల్

Mission Kakatiya Works at Kalvokol Area of Rangareddy District

మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ చరిత్రను వెలికి తీస్తుందా… సమైఖ్యపాలనలో కనుమరుగైన చరిత్ర ఆనవాళ్ళు బహిర్గతమవుతున్నాయా… భూగర్భ జలాలు గణంగా అభివృద్ధి చెందటంతో జలసిరులు పొంగి పొరలుతున్నాయా.. ప్రతి చుక్కను ఒడిసి పడుతున్న మిషన్ కాకతీయ పనుల్లో చారిత్రక అంశాలు తొంగిచూస్తున్నాయా. అనడానికి కల్వకోల్ చెరువులో బహిర్గతమైన కాకతీయుల శాసనాలే ఓ ఉదాహరణ.

శంషాబాద్ జిల్లా మారుమూలల్లోని కల్వకోల్ ప్రాంతం మిషన్ కాకతీయ పనులకు ముందు ఎడారిని తలపించింది. పుడమితల్లి నీటి బిందువులకోసం కన్నీరు కార్చింది. సమైఖ్యపాలకుల భూదందాకు బిందువైంది.144 ఎకరాల సిఖం ఉన్నా, 300 ఎకరాల ఆయకట్టు ఉన్నా కల్వకోల్ కలత చెందింది. అయితే మిషన్ కాకతీయ పనులతో సింగారించుకున్న ఈ చెరువు ఓ జలసిరి కాంతులు ఈనగా పరిసరాలు పచ్చబడ్డాయి. అయితే ఈ చెరువు మరో కోణాన్ని పరిశీలిస్తే కాకతీయ రుద్రమదేవి విజయయాత్రకు చిహ్నంగా కల్వల చెరువు పేరుతో నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు, శిలలు ..శిల్పాలు… శాసనాలు మిషన్ కాకతీయ పనుల్లో వెలుగు చూశాయి. చెరువుల నిర్మాణ మహా పుణ్యకార్యంగా భావించిన కాకతీయుల చెరువులు చెరువుల పరిశోధకులకు కొత్తకోణాన్ని ఆవిష్కరింపచేస్తున్నాయి.

మస్తిష్కాలకు పదును పెడుతున్నాయి. క్రీస్తుశకం 1229 రుద్రమదేవి మరణానికి ముందు కల్వకోల్ చెరువు నిర్మించినట్లు చరిత్ర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. శిథిలాలు మౌనంగా చెరువుల కథలు చెపుతున్నాయి. కాకతీయ రాజులు తెలంగాణలోని నీటి వనరులను పెంపొందించడానికి కాకతీయ, రెడ్డిరాజులుతో పాటు సామంతులు, మహారాణులు చెరువులు నిర్మించి పుణ్యకార్యంలో భాగస్వామ్యం అయ్యారు. ఈ పునర్ నిర్మాణపు పనుల్లో రెండవ బేతరాజు చెట్టిసముద్రం, కెరె సముద్రం, కేసరిసముద్రం, గణపతిదేవుడు రాజ్యం నలుమూలల తవ్వించిన వేలాది చెరువుల పునరుద్ధరణ కొనసాగుతుంది. అయితే మహారాజులు నిర్మించిన చెరువులు ఆదర్శంగా తీసుకుని సామంతులు, వ్యాపార వేత్తలు, ప్రముఖులు అనేక చెరువులు నిర్మించారు. అయితే రాజులకు తోడుగా మేము సైతం అంటూ మహారాణులు నిర్మించిన చెరువులు నేటికి సాగునీరు అందిస్తూ శతాబ్దాల చరిత్రకు చెరగని చిరునామాగా ఉన్నాయి. కాకతీయులు, బహమనీలు, కుతుబ్ షాహీలు, గద్వాల, వనపర్తి, జటప్రోలు, నారాయణ్ పూర్, గోపాల్ పేట, దోమకొండ, సిర్నెపల్లి, మెతుకు సీమ సంస్థానాధీశులు చెరువులను తవ్వించే వార సత్వాన్ని కొనసాగించి తెలంగాణను సశ్యశ్యామలం చేశారు.