Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

మిషన్ కాకతీయ తో చెరువులు జలకళ

Mission kakatiya works doing in ponds

గండీడ్ : మిషన్ కాకతీయ పథకం ద్వార చెరువులో పూడుక పోయిన ఒండు మట్టి తీయడంతో చెరువుల్లో లోతు పెరిగి నీటి మట్టం పెరుగుతుందని పరిగి ఎంఎల్‌ఏ రామ్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామ శివారుల్లో ఉన్న బోయకుంట 13 లక్షలు , నంచర్ల బంటుకుంట 27.10 లక్షలు ,పోతుల కుంట 28.20 లక్షలు ,అన్నారెడ్డి పల్లి లో కిష్టయ్య కుంట 13.10 లక్షలనిధులతో పనులు ప్రారంభం చేయడం జరిగింది . 5 కోట్ల 23 లక్షల నిధులతో మిషన్ కాకతీయ 4 వ విడత పనులను ఆయన చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మిషన్ కాకతీయ పనులతో కుటంలు ,చెరువులు ,చెరువుల తూములు ,కట్టలు మేరుగవుతాయని పేర్కోన్నారు. చెరవుల్లో మట్టి తీయడంతో వర్షకాలం చెరువులో నీటి నిల్వ ఎక్కుగా ఉండడం జరుగుతుందని తెలిపారు. మహమ్మదాబాద్ ,మల్కచెరువు ,సాలర్ నగర్ ప్రాజేక్ట్‌లు కూడ అతి త్వరలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభం అవుతాయన్నారు. వెన్నాచేడ్ పెద్ద చెరువు మిషన్ కాకతీయ కింద పెట్టడానికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్ళి వెంటనే నిధులు వచ్చేల కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
రోడ్లు సమస్యలను వెంటనే పరిష్కరించెందుకు కృషి
చెలిమిళ్ళ గ్రామ శివారులో ఉన్న బోయ కుంట నుండి రైతులకు పోలాలకు వెల్లుటకు బాట కావాలని ఎంఏల్‌ఏ ను అడగడంతో వెంటనే ఆర్‌ఐ గోవర్ధన్ ను అడిగి వెంటనే సర్వే చెయించి రైతులకు బాట సమస్యను పరిష్కారం చేయాలని తెలిపారు . నంచర్ల అనుంబం గ్రామం జంగం పల్లి గ్రామానికి చెందిన ప్రజలు గ్రామానికి రోడ్డు కావాలని కోరాడంతో వెంటనే ఎంఎల్‌ఏ రామ్మోహన్ రెడ్డి స్పందించి ఎంఎల్‌ఏ నిధుల నుండి 5 లక్షలతో రోడ్డు ను వేయడం జరుగుతుందని గ్రామస్తులకు హామి ఇచ్చారు. జంగంపల్లిలో విద్యుత్ తీగలు వేలాడి ఉన్నాయి కావున వెంటనే వాటిని మార్పు చేయాలని విద్యుత్ డీఈ తో పోన్‌లో మాట్లాడి రెండు రోజుల్లో విద్యుత్ తీగలను తొలగించి గ్రామస్తులకు సమస్య లేకుండ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి రాధారెడ్డి ,మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు వెంకట్ రాంరెడ్డి ,జితేందర్ రెడ్డి ,కెఎం నారాయణ ,రాములు ,సూపర్‌డెంట్ కాళుసింగ్ ,ఇరిగేషన్ ఏఈ శివరాం ,ఆర్‌ఐ గోవర్దన్ ,విఆర్‌ఓ ఆశన్న కాంగ్రేస్ నాయకులు వెంకట్‌రాంరెడ్డి ,లకా్ష్మరెడ్డి , కాంట్రాక్టర్లు వెంకట్‌రాంరెడ్డి , పాష , సురేష్ రవి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments