Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మిథాలీ రాజ్ ఖాతాలో మరో రికార్డ్…

mithali-raj-cricket

హైదరాబాద్: ఇటీవల అత్యధిక వన్డేలు ఆడిన ఘనతను తన పేరిట లిఖించుకున్న భారత మహిళా వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్.. తాజాగా మరో రికార్డు సాధించింది. అంతర్జాతీయ మహిళా వన్డే క్రికెట్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు నమోదు చేసిన రికార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లడ్‌తో జరిగిన మూడో వన్డేలో మిథాలీ రాజ్(74 నాటౌట్) హాఫ్ సెంచరీ సాధించడంతో 56 అర్థ శతకాలతో కొత్త అధ్యాయనాన్ని లిఖించింది.
ఈ క్రమంలో ఇప్పటివరకు ఇంగ్లడ్ మాజీ క్రీడాకారిణి ఎడ్వర్డ్ పేరిట ఉన్న 55 హాఫ్ సెంచరీల రికార్డును మిథాలీ రాజ్ బ్రేక్ చేసింది. ఇంగ్లడ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సాధించింది.

Comments

comments