Home జాతీయ వార్తలు నటి రాధిక కూతురుతో మిథున్ పెళ్లి

నటి రాధిక కూతురుతో మిథున్ పెళ్లి

cricketer-mithunచెన్నై: కర్ణాటక పేసర్ అభిమన్యూ మిథున్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. దక్షిణాది ప్రముఖ సీనియర్ నటి రాధికా కూతురు రయా నె రాధికాను మిథున్ మనువాడనున్నాడు. ఈ నెల 23న రయానె, మిథున్‌కు ఎంగేజ్‌మెంట్ చెన్నైలో జరుగుతన్నట్లు స్వయానా నటి రాధికానే తన ట్విట్టర్‌లో పేర్కొంది. పెళ్లి ఎప్పుడు అనేది ఇంకా ఖరారు కాలేదు. గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న రయానె, మిథున్ చివరి తమ తల్లిదండ్రులను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. కర్ణాటక రాష్ట్ర జట్టు ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న 25 ఏళ్ల మిథున్ భారత్ తరుపున ఐదు వన్డేలు, నాలుగు టెస్టులు ఆడాడు.