Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

‘కారు కథ’ కలకలం

ఆసక్తి రేకెత్తించిన ‘మనతెలంగాణ’ కథనం

                       Car-Story

హైదరాబాద్: ‘మన తెలంగాణ’లో గురువారం పతాక శీర్షికగా ప్రచురితమైన ‘కారు కథ!’ వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ వార్తపై రాజకీ యవర్గాల్లో ఆసక్తి రేకిత్తించింది. అనేక వాట్సాప్ గ్రూప్ లు, ఫేస్‌బుక్, తదితర సోషల్ మీడియాలో కూడా ‘కారు కథ!’ వార్త రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. జర్నలి స్టుల్లో కూడా దీనిపై చర్చ జరిగింది. ఇటీవల రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించిన మియాపూర్ భూ కుంభ కోణంతో సంబంధం ఉన్న ట్రినిటీ ఇన్‌ఫ్రా వెంచర్స్ సంస్థ పేరుతో రిజిష్టరైన కారు ఎవరి వద్ద ఉందనే అందరిలో ఆసక్తి నెలకొంది.

ఆ కారు రిజిస్ట్రేషన్‌లో పేర్కొన్న ఫోన్ నెంబర్ ఎవరిదని పాఠకులు తమ తమ స్థాయిల్లో ఆరా తీశారు. కొందరు ట్రూ కాలర్ ద్వారా, మరికొందరు గూగుల్ డుయో ద్వారా, రకరకాలుగా నెంబర్ ఎవరిదో తెలుసుకున్నారు. గాంధీభవన్‌లో ఎఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపివి.హనుమంతరావు ‘మన తెలంగాణ’లో వచ్చిన ‘కారు కథ’ను ఆద్యంతం ఆసక్తిగా చదివారు. ఈ ఘటన వెనుక పెద్దల పేర్లు బయటికి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. మరో వైపు ఎన్‌టిఆర్ ట్రస్టు భవన్‌లో కూడా టిడిపి నాయకులు ఈ వార్త ప్రచురించిన పత్రి కను ప్రశంసించారు. అధికార టిఆర్‌ఎస్‌లో మాత్రం ఈ కథనంపై అంతా గుంభనంగా వ్యవహరించారు.

ప్రెస్‌మీట్‌లో చూపించిన టిడిపి నేతలు

టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి మీడియా, అధ్యక్షులు ఎల్.రమణలు ‘కారు కథ’ క్లిప్పింగ్‌ను ప్రదర్శించారు. ఈ వార్త, అందు లోని ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ‘మన తెలంగాణ’ను రమణ, రేవంత్‌రెడ్డిలు అభినందించారు. సమాజానికి వాస్తవాలను చెబుతున్న పత్రిక అని ప్రశంసించారు.

Comments

comments