Home జాతీయ వార్తలు మీ టూ ఎఫెక్ట్: కేంద్రమంత్రి రాజీనామా?

మీ టూ ఎఫెక్ట్: కేంద్రమంత్రి రాజీనామా?

MJ Akbar resigns as MoS External Affairs: Me Too

న్యూఢిల్లీ: జర్నలిస్టులపై లైంగిక వేధింపుల ఆరోపణలతో కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి ఎంజె అక్బర్ తన పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. గత కొద్ది రోజులుగా నైజీరియా పర్యటనలో ఉన్న అక్బర్, ఆదివారం ఉదయం భారత్ కు తిరిగి వచ్చారు. అయితే, విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారట. అనంతరం మెయిల్ ద్వారా ప్రధాని కార్యాలయానికి అక్బర్ తన రాజీనామా లేఖను పంపించినట్టు తెలుస్తోంది. మంత్రి రాజీనామా విషయాన్ని పిఎంఒ ధ్రువీకరించాల్సి ఉంది. కాగా, అక్బర్ ఎడిటర్‌గా పనిచేసిన  సమయంలో తమను వేధించాడంటూ ఇటీవల ముగ్గురు మహిళా జర్నలిస్టులు ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కేబినెట్ నుంచి తప్పుకోవాల్సిందేనన్న ఒత్తిడి పెరిగింది. విదేశీ పర్యటన నుంచి రాగానే రాజీనామా చేస్తారని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం ప్రకంపనలు కొనసాగుతున్న వేళ పలు రంగాలకు చెందిన మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతున్నారు