Search
Wednesday 26 September 2018
  • :
  • :

పార్టీలో చేర్చుకుంటే.. స్టాలిన్‌ను అధినేతగా అంగీకరిస్తా!

MK Alagiri press meet DMK MK Stalin joined an Alagiri

చెన్నై: తనను పార్టీలో చేర్చుకోకపోతే స్టాలిన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఎంకె అళగిరి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ద్రవిడ మున్నేట్ర కళగం(డిఎంకె) అధ్యక్షుడిగా ఎంకె స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విదితమే. ఈ సందర్భంగా అళగిరి మాట్లాడుతూ… స్టాలిన్ డిఎంకె అధినేతగా అంగీకరిస్తానని చెప్పారు. పార్టీలో చేరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అళగిరి వెల్లడించారు. స్టాలిన్‌ను లీడర్‌గా అంగీకరించడం తప్పనిసరని ఆయన అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అళగిరిని 2014లో డిఎంకె నుంచి కరుణానిధి బహిష్కరించిన సంగతి తెలిసిందే.

Comments

comments