Home జాతీయ వార్తలు సిఎం పళనిస్వామితో ఎంకె స్టాలిన్ భేటీ…

సిఎం పళనిస్వామితో ఎంకె స్టాలిన్ భేటీ…

Mk Stalin Meets with Tamil Nadu CM palaniswami

చెన్నై: తమిళనాడు సిఎం పళనిస్వామితో డిఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ మంగళవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు.  స్టాలిన్ పళనిస్వామి ఇంటికి చేరుకొని కరుణానిధి ఆరోగ్య పరిస్థితిని ఆయనకు వివరించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిలో  ఎటువంటి మార్పు లేకపోవడంతో సిఎంతో స్టాలిన్ భేటీ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కరుణానిధి గత పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే సోమవారం సాయంత్రం కరుణనిధి ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక వైద్యబృందం బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ప్రస్తుతం కరుణానిధిని క్రిటికల్ కేర్ యూనిట్‌లో పర్యవేక్షణలో ఉన్నారు. వయోభారం దృష్ట్యా… ఆయన శరీరంలోని కీలక అవయవాలను సాధారణ స్థితికి తీసుకురావడం ఇబ్బందిగా మారుతోందని డాక్టర్లు వెల్లడించారు. రానున్న 24 గంటల్లో కరుణనిధి శరీరం స్పందించే తీరును బట్టి తదుపరి ట్రీట్‌మెంట్ ఉండనుంది. ప్రస్తుతం ఆయన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారని దవాఖాన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ బులెటిన్ లో పేర్కొన్నారు.