Home సంగారెడ్డి కామిడి షో అనుకుంటున్నావా…?

కామిడి షో అనుకుంటున్నావా…?

Babu-Mohan

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన జిల్లా పరిషత్ సమావేశాన్ని సోమవారం చైర్‌పర్సన్ రాజమణీ మురళీయాదవ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు వారి వారి శాఖల పరంగా వివరాలు తెలుపుతున్న సమయంలో మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఒటోజా తన శాఖకు సంబంధించిన వివరాలు తెలుపుతుండగా సంగారెడ్డి జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ బెల్టు షాపులకు సంబంధించి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాగా అధికారి తనకు ఎక్సైజ్ శాఖకు సంబంధంలేదని, తాను గిరిజన సంక్షేమ శాఖ అధికారినని సెలవిచ్చారు.

దీంతో సభాప్రాంగణమంతా పక్కుమని నవ్వారు. దీంతో అధికారి కూడా వారితో కలిసి చిరునవ్వు చిందించారు. అయితే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, అందోల్ ఎమ్మెల్యే బాబుమోహన్‌లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడేమన్న కామిడీ షో నడుస్తుందా.. వైఆర్‌యూ లాఫింగ్ అంటూ మండిపడ్డారు. కాగా అధికారి ఒక్కసారిగా ఖంగుతిని నీళ్లు నమిలారు. సభాప్రాంగణంలో ఉన్న సభ్యులందరు అధికారిపై అసహ నాన్ని వ్యక్తం చేశారు. మంత్రి హరీష్‌రావు కలుగ జేసుకొని ఎందుకు నవ్వావయ్యా.. క్షమాపణ చెప్పు అని అధికారిని ఆదేశించారు. దీంతో గిరిజన సంక్షేమ అధికారి క్షమాపణ చెప్పడంతో సభ తిరిగి ప్రారంభమైంది.