Home సంగారెడ్డి కార్పొరేటుకు దీటుగా సర్కార్ బడులు

కార్పొరేటుకు దీటుగా సర్కార్ బడులు

MLA Babu Mohan Speech About GoVt School Education

మన తెలంగాణ/జోగిపేట : సియం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడిందని అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. శుక్రవాకం అందోల్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదటిగా గ్రామంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాలలో సరస్వతీ దేవి, ఆచార్య జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటుకు దీటుగా సర్కార్ బడులలో మెరుగైన సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉచితంగా దుస్తులు, పుస్తకాలతో పాటు రుచికరమైన భోజన వసతి లాంటి సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యవంతులను చేసి ప్రభుత్వ పాఠశాల పనితీరును వివరించాలని ఆయన ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందు కోసం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అందోల్, జోగిపేట మున్సిపాలిటీ కమీషనర్ అంబదాస్ రాజేశ్వర్, ఎంఈఓ బండి కృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి.నాగభూషణం, జిల్లా గ్రాంథాలయ సంస్థ డైరెక్టర్ అల్లె శ్రీకాంత్, జోగిపేట మున్సిపాల్ టీఆర్‌ఎస్ అధ్యక్షులు చాపల వెంకటేశం, నాయకులు అనిల్‌రాజ్, వినోద్‌రెడ్డి, పెండగోపాల్, జంగం మహేష్, నాగరత్నంగౌడ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.