Home తాజా వార్తలు ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత కాంగ్రెస్‌దే

ఎన్నికైన ప్రభుత్వాలను రద్దు చేసిన ఘనత కాంగ్రెస్‌దే

Balka-Suman

n ప్రజాస్వామ్యం గురించి హస్తం పార్టీ మాట్లాడడం సిగ్గుచేటు
n భట్టి విక్రమార్క ప్రవచనాలు వల్లిస్తున్నారు
n అభివృద్ధే టిఆర్‌ఎస్ విధానం
ఎమ్మెల్యే బాల్క సుమన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికయిన ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర కాంగ్రెస్‌దని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్‌ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్ రావు, టిఆర్‌ఎస్ (వి) అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిపి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ విధించిన కాంగ్రెస్ పార్టీ నోటి వెంట ప్రజాస్వామ్యం అనే పదం రావడమా దురదృష్టకరమని, ఆ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఉద్యమ పార్టీ అయిన టిఆర్‌ఎస్‌ను విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిం చలేదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమాన్ని అణచివేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గుచేట న్నారు. కాంగ్రెస్ అంతర్గత ఆధిపత్య పోరులో భాగంగానే భట్టి దీక్ష చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి ఎవరో ఎటో పోతారని వార్తలు వస్తున్నాయని, ముందు భట్టి ఆ సంగతి చూసుకోవాలని ఆయన సూచించారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో భట్టి ప్రవచనాలు వల్లిస్తున్నాడని ఆయన ఆరోపించారు. మండల, జడ్పీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, అయినా కాంగ్రెస్ నేతల తీరు మారడం లేదన్నారు. టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల నియో జకవర్గాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధే టిఆర్‌ఎస్ విధానమని, తమను కొనుగోలు చేయడానికి గొర్రెలం, బర్రెలం కాదని ఎమ్మెల్యేలు స్పష్టంగా చెప్పారని అయినా కాంగ్రెస్ నాయకులకు బుద్ధిరావడం రాలేదన్నారు. భట్టి చేసింది ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష కాదని, పదవీ పరిరక్షణ దీక్ష అని టిఆర్‌ఎస్ కార్యదర్శి గుట్టు రాంచందర్ రావు ఆరోపించారు. టిఆర్‌ఎస్ లోకి వచ్చింది 12 మంది ఎమ్మెల్యేలని, రాజ్యాంగ బద్ధంగానే వారు కాంగ్రెస్‌ను వీడారని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి పదో షెడ్యూల్‌లో స్పష్టంగా నిబంధనలు ఉన్నాయని, సిఎం కెసిఆర్‌తో భట్టి చర్చించేదేమి ఉంటుందని, అంబెడ్కర్ రాజ్యాంగం తప్పని భట్టి అంటారా అని ఆయన ప్రశ్నించారు.

ఫిరాయింపు దారుడు రేవంత్ ను పక్కన పెట్టుకుని భట్టి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భట్టి నియోజకవర్గంలో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయిందన్నారు. దమ్ముంటే భట్టి రాజీనామా చేసి మధిరలో మళ్లీ గెలవాలని ఆయన సవాల్ విసిరారు. భట్టి మిగతా నేతల వలసలను ఆపగలిగితే మంచిదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు కట్టి పెట్టాలని ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగానే ఎమ్మెల్యేల చేరికను స్పీకర్ ఆమోదించారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట డ్రామాలు ఆపితే మంచిదని ఆయన సూచించారు.

MLA Balka Suman press meet in Telangana Bhavan