Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

నష్టపోయిన వరిపంటలను పరిశీలించిన ఎంఎల్‌ఎ

stand

మనతెలంగాణ/పెద్దపల్లిరూరల్: వడగండ్ల వానకు దెబ్బతిన్న వరిపంటలను ఎం ఎల్‌ఎ దాసరిమనోహర్‌రెడ్డి సోమవారం మండలంలోని కాసులపల్లి, బోంపల్లి , పా లితం,గోపయ్యపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఆదివారం రాత్రి కురిసిన రాళ్ల వాన కు దెబ్బతిన్న వరి పంటల రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ దెబ్బతిన్న వరి పంటల రైతులను ఆదుకుంటామని,ప్రభుత్వం దృష్టికి తీసుకోనిపోయి నష్టపరిహారం ఆందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపా రు. పంటనష్టంపై సర్వే చేయించి నివేదిక తయారుచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు.రైతులు ఎవరు ఆదైర్య పడకుడదని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపిపి దాసరి చంద్రారెడ్డి, సర్పంచ్ తిరుపతిరెడ్డి, రమణారెడ్డి, దా మోదర్‌రెడ్డి, ఎఇఒ రమేష్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Comments

comments