Home జాతీయ వార్తలు అనాథ శవానికి ఎంఎల్‌ఎ అంత్యక్రియలు

అనాథ శవానికి ఎంఎల్‌ఎ అంత్యక్రియలు

Odisha : MLA Funeral to Unidentified Woman dead body

భువనేశ్వర్ : ఓ అనాథ శవానికి ఒడిశా ఎంఎల్‌ఎ రమేశ్ పటువా అంత్యక్రియలు చేశారు. అధికార బిజు జనతాదల్ (బిజెడి)కి చెందిన ఎంఎల్‌ఎ రమేశ్ తన కొడుకు, మేనల్లుడితో కలిసి మహిళా మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఝర్సుగూడ జిల్లాలోని రెంగాలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ శనివారం మృతి చెందింది. ఈ మహిళ అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆ నియోజకవర్గ ఎంఎల్‌ఎ అయిన రమేశ్ అంత్యక్రియలు చేశారు. అనాథ మహిళకు అంత్యక్రియలు చేసిన ఎంఎల్‌ఎ రమేశ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధులకు ఆయన దార్శనికుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

MLA Funeral to Unidentified Woman dead body