Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

బూతులు తిట్టారని జనంపై తుపాకీ పెట్టిన ఎంఎల్ఎ

kerala-Mlaకొట్టాయం: ఓ ప్రజాప్రతినిధి ఆందోళన చేస్తున్న జనంపై విరుచుకుపడ్డాడు. తన వద్దనున్న తుపాకీతో ఎక్కుపెట్టి బెదిరించాడు. పైగా తానే తప్పు చేయలేదని, తన వద్ద ఉన్నది లైసెన్స్డ్ రీవాల్వార్ అని సమర్థించుకున్నాడు కేరళ రాష్ట్రానికి చెందిన ఎంఎల్ఎ పిసి జార్జ్. వివరాల్లోకెళితే కొట్లాయం జిల్లా ముండకాయంలోని ఓ ప్రైవేట్ భూముల్లో కొందరు పేద కూలీలు ఇటీవల గుడిసెలు వేసుకున్నారు. దీనికి అక్కడి కార్మికులు, కూలీలు వ్యతిరేకించారు. ఏస్టేట్ లో పనిచేసే కార్మికులు, కూలీలు గుడిసెలేసుకున్న కూలీలపై దాడికి దిగారు. విషయం తెలుసుకున్న ఎంఎల్ఎ జార్జి అక్కడికి చేరుకుని పేద కూలీలకు బాసటగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎస్టేట్ కార్మికులు, కూలీలు ఎంఎల్ఎ పట్ల దురుసుగా ప్రవర్తించడంతో తన వద్ద ఉన్న రివాల్వార్ తో కార్మికుల వైపు ఎక్కు పెట్టారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని విషయాన్ని సర్దిచెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంఎల్ఎ తన వద్ద ఉన్నది లైసెన్స్ రివాల్వార్ అని చెప్పుకున్నారు.

Comments

comments