Home నాగర్ కర్నూల్ తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే

తెలంగాణను ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే

MLA Guvvala Balaraj Speaking Against Congress Party

అచ్చంపేట ఎంఎల్‌ఎ గువ్వల బాల్‌రాజ్
మన తెలంగాణ/అచ్చంపేట: దప్రాజెక్టుల నిర్మానాలను గాలికి వదిలి తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రేస్ పార్టీదే నని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజ్ ఆరోపించారు. శుక్రవారం అచ్చంపేట పట్టనంలోని నగర పంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ ఈపీసీ విదానం ద్వారా ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మను దుర్విని యోగం చేసి ప్రజలకు సాగునీరందకుండా కాంగ్రేస్ నేతలు ప్రజల ఉసురు పోసుకన్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడు తున్న ప్రాజెక్టుల నిర్మానాలకు అడుగడుగున అడ్డుపడుతూ నిర్మాణాలు త్వరతి గతిన పూర్తికాకుండా అడ్డుకుంటున్న కాంగ్రేస్ పార్టీకి ప్రజలసంక్షమంపై ప్రభు త్వాన్ని ప్రశ్నించే హక్కు లేదని హెచ్చరించారు. కాంగ్రేస్ ప్రభుత్వం కాంట్రా క్టర్లు ఇచ్చే కమీషన్‌లకు కక్కుర్తి పడి అన్ని ప్రాజెక్టులను ఆదిలోనే వదిలేషా యని, ఆప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం త్వరతి గతిన పూర్తి చేసి రాష్ట్రంలో ఆరు లక్షల 50 వేల ఎకరాలకు సాగునీరందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వా నికే దక్కిందన్నారు. పాలమూరు జిల్లాలో వలసలు వాపస్ రావాలనే లక్షంతో కృష్ణ నది ద్వారా కేఎల్‌ఐ, పాలమూరు ఎత్తి పోతల పథకాల ద్వారా ప్రతి ఎకరాకు నీరందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పార్ట్‌టైం పొలిటీ షన్‌గా పని చేస్తూ ఎన్నికల ముందు హడావిడి చేసి కాట్రాక్టర్ల వద్ద మీటింగ్‌ల పేరుతో డబ్బులు వసూలు చేసే వంశీకృష్ణ తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. ప్రతి రోజు వైద్యం పేరుతో అధిక ఫీజులు వసూలు చేసే నీలాంటి నేతలు అవినీతి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ తాను అవినీతికి పాల్పడుతున్నాని ఆరోపించడం సిగ్గు చేటని, అవినీతి పై చర్చించేందుకు తాను సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు. పులిజాల వద్ద నిలిచి పోయిన కేఎల్‌ఐ కాలువ 14 కిలొ మీటర్ల కాలువ పొడిగింపు పనులకు ప్రభుత్వం జీఓ నెంబర్ 657 విడుదల చేసి, సర్వేకు 84 లక్షల 55 వేలు నిధలు విడుదల చేయడం జరిగిందన్నారు.

అచ్చంపేట నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై, తనపై అసత్యపు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవలని చూసే కాంగ్రేస్ నేతలకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చ రించారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ తులసీరాం, రైతు సమ న్వయ కమిటీ జిల్లా కన్వీనర్ మనోహర్, వైస్ చైర్మెన్ బందంరాజు, బల్మూర్ ఎంపీపీ కరునాకర్ రావు, వంగూర జెడ్‌పీటీసీ భీముడునాయక్, రైతు సమన్వ య సమితీ మండల కోఆర్డినేటర్ రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అద్యక్షుడు కోట కిషోర్, నేతలు రఘురాం, బాల్‌రాజు, నీడ్స్‌బాబ, నర్సింహ్మారెడ్డి, విష్ణు మూర్తి, గడ్డం పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.