Home తాజా వార్తలు తానా మహాసభలకు ఎంఎల్ఎ హరిప్రియ దంపతులకు ఆహ్వానం

తానా మహాసభలకు ఎంఎల్ఎ హరిప్రియ దంపతులకు ఆహ్వానం

Yellandu MLA Haripriya couples

 

భద్రాద్రి కొత్తగూడెం: అమెరికాలో ప్రతీ సంవత్సరం 22 వ తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) మహాసభలను నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ సారి జూలై 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమెరికాలో జరిగే 22 వ తానా మహాసభాలకు ఇల్లందు ఎంఎల్ఎ హరిప్రియ నాయక్ దంపతులకు ఆహ్వానం అందింది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రముఖులను తానా ఆహ్వానించటం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

అదే నేపథ్యంలో అతి చిన్న వయస్సులోనే ఎంఎల్ఎగా ఎన్నికై ప్రజల ఆదరాభిమానాలు పొందిన గిరిజన మహిళ ఎంఎల్ఎ హరిప్రియ దంపతులను తానా మహాసభల నిర్వాహకులు జయరాం కోమటి, గంగాధర్ నాదెండ్ల, సతీష్ వేమన, జయశేఖర్ తాల్లురి, సభ్యులు సందీప్ నుంచి ఆహ్వానం లభించింది. దీంతో అమెరికాలో జరిగే 22 వ తానా సభలో ఎంఎల్ఎ హరిప్రియతో పాటు తన భర్త హరిసింగ్ నాయక్ కూడా పాల్గొననున్నారు. నూతనంగా ఏర్పడ్డ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి తానా సభలకు వెళ్లనున్న తొలి ఎంఎల్ఎ హరిప్రియ కావటం విశేషం.

MLA Haripriya couples invited to 22nd TANA Convention