Home వరంగల్ రూరల్ రైతులకు రక్షణగా ‘రైతుబంధు’

రైతులకు రక్షణగా ‘రైతుబంధు’

 MLA is Errabella speech about rythu bandhu

మన తెలంగాణ/రాయపర్తి: రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని పాలకుర్తి ఎంఎల్‌ఎ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం మండలంలోని పెరుకవేడు, కొండాపురం గ్రా మాలలోని ఉన్నత పాఠశాలల ఆవరణంలో రైతుబంధు పథకంలో చెక్కుల పంపిణీ, పాస్ పుస్తకాల పం పిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొ న్న దయాకర్‌రావు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. రైతులకు చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నదని, రైతుల బాధలను చూడలేక సిఎం కెసిఆర్ వారి సంక్షే మం కోసం 24 గంటలు కరెంట్ ఇస్తూ సకాలంలో ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తూ పెట్టుబడికి ఇబ్బంది కలుగకుండా ఎకరాకు రూ.4వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి రైతుకు రైతుబంధు చెక్కుతో పాటు రూ. 5 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, గతంలో పనిచేసిన ఏప్రభుత్వం కూ డా రైతులను పట్టించుకోలేదన్నారు. ఈకార్యక్రమం లో ఆయా గ్రామాల సర్పంచ్‌లు గారె అనిత, వీరమ్మ, ఎంపిపి విజయనామా, వైస్ ఎంపిపి యాకనారాయ ణ, జెడ్‌పిటిసి యాకమ్మ, తహసీల్దారు రాంమూర్తి, ఎంపిడిఓ మోజెస్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్‌రూరల్ : 70 ఏళ్ళు పరిపాలించిన పాలకులు చేయలేని అభివృద్ధి కేవల నాలుగు ఏళ్ళలలో బంగారు తెలంగాణకు బాటలు వేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కుతుందని మానుకోట ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ అన్నా రు. ఆదివారం మండలంలోని బేతోల్, పర్వతగిరి గ్రా మాలలో రైతులకు చెక్కులు, పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చెయలేని పధకాలను కెసిఆర్ ప్రజలకు అందించారని, రైతులకు నీళ్ళుతో పాటు నిధులు అం దిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్‌ఎస్ అన్నారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపమోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయకుమార్,మండల ప్రతేక అధికారి వీరేషం,ఎఒ రామరావు, టిఆర్‌ఎస్ నాయకులు మార్నేని వెంకన్న, తేళ్ళ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వార్డు నెంబర్లు, రైతులు పాల్గొన్నారు.
దేవరుప్పుల : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దేవరుప్పుల ఉన్నత పాఠశాలలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రైతుల సంక్షేమానికి వినూత్న పథకాలు ప్రవేశపెడుతుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో పాలకుర్తి నియోజకవర్గానికి అధిక నిధులు వెచ్చించినట్లు తెలిపారు. రైతుబంధు కార్యక్రమంతో గ్రామాలలో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు. దేవరుప్పుల రెవెన్యూ పరిధిలో 1912 మంది రైతులకు సూమారు రూ. 2.28కోట్ల విలువగల 1946 చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి సోమనర్సమ్మ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ నరసింహరెడ్డి, గ్రామ కోఆర్డినేటర్ బిక్షపతి, ఎఎంసి వైస్ ఛైర్మన్ దయాకర్ పాల్గొన్నారు.
దామెర : రైతులకు భరోసా రక్షణ కల్పించే రైతు బంధు పథకం చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం దామెర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సర్పంచ్ బిల్లా సరోజిని దేవి అధ్యక్షతన రైతు బంధు పథకం చెక్కులు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బిల్లా రమణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ దేశంలో ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రైతులు సంక్షేమానికి పాటుపడుతున్నారని అన్నారు. గతంలో ఎరువులు విత్తనాల కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది అన్నారు. నకిలి విత్తనాలలో పంటలు కోల్పోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అన్నారు. అంతేగాక పంట పెట్టుబడి కోసం అప్పులు చేయకుండా రైతులకు ఎకరాకు రూ.4 వేలు అందించడం హర్షనీయం అన్నారు. అనంతరం రైతులకు పట్టా పాస్ పుస్తకాలు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఫణికుమార్, తహసీల్దార్ సరిత, వ్యవసాయ అధికారిణి శ్వేత, రైతు సమితి సభ్యులు శంకర్, కృపాకర్ రెడ్డి, లింగమూర్తి, గిరిదావరి షఫీ అహ్మద్, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జాకీర్ అలి, ఉపాధ్యక్షుడు దాడి రమేష్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.