Home కరీంనగర్ అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజు

అసెంబ్లీ చరిత్రలో చీకటిరోజు

jeevan-reddyరైతు ఆత్మహత్యలపై ప్రస్తావించాలని ప్రయత్నిస్తే బహిష్కరిస్తారా?
ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరం, టిఆర్‌ఎస్ ఒంటెద్దు పోకడ సరైంది కాదు
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే, ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేయాలి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిందే సిఎల్‌పి ఉపనేత: ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి డిమాండ్

సిరిసిల్ల: అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై ప్రస్తావించాలని ప్రయత్నించిన ప్రతిపక్షాల సభ్యులను సస్పెండ్ చేయడం బాధాకరమని, అసెంబ్లీ చరిత్రలోనే ఇది చీకటి రోజుగా మిగులుతుందని సిఎల్‌పి ఉపనేత, ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం సిరిసిల్లలో ఆయన పిసిసి కార్యదర్శి నాగుల సత్యనారాయణ ఇం ట్లో విలేఖరులతో మాట్లాడారు. అసెంబ్లీని ఏక పక్షంగా నిర్వహించాలని ప్రతిపక్షాలన్నింటినీ బహిష్కరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని హితవు పలికారు.

రైతుల ఆత్మహత్యల నివారణకు, రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మ హత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఈ సందర్భం గా జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సైద్ధ్దాంతిక విరోధా లున్న కాంగ్రెస్, బిజెపి, ఇతర ప్రతిపక్షాలు రై తుల సమస్యలపై ఏకాభిప్రాయంతో చర్చలకు రాగా, టిఆర్‌ఎస్ ఏకపక్ష విధానం, ఒంటెత్తు పోకడలకు పోవడం సరైంది కాదన్నారు. టి ఆర్‌ఎస్ ఎన్నికల సభల్లో ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. సభలో రైతులు, ఆశావర్కర్లు, ఇతర సమస్యలపై ప్రతిపక్షం మాట్లాడకుండా టిఆర్‌ఎస్ గొంతునొక్కాలని చూస్తుందని, ప్రజాక్షేత్రంలో ఈ విషయాలపై ప్రతిపక్షాలు ప్రచారం సాగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ చొప్పదండి ప్రకాశ్, కాం గ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు వైద్య శివప్రసాద్ తదితరులున్నారు.