Home తాజా వార్తలు ‘మిషన్ భగీరథ’కు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు: కర్నె

‘మిషన్ భగీరథ’కు కేంద్రం రూపాయి కూడా ఇవ్వలేదు: కర్నె

 

హైదరాబాద్: తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంఎల్ సి కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కేంద్రం ఏం ఇచ్చిందో దత్తాత్రేయ లెక్కలతో సహా చెప్పాలన్నారు.

దత్తాత్రేయ స్థాయికి తగ్గట్లు మాట్లాడాలని, అయనకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని కర్నె సవాల్ విసిరారు. వ్యవసాయానికి ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని,  బిజెపి పాలిత రాష్ర్టాల్లో 24 గంటల కరెంట్  ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

MLA Karne Prabhakar fires on Dattatreya