Home జాతీయ వార్తలు శ్రీవారిని దర్శించుకున్న ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి

శ్రీవారిని దర్శించుకున్న ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి

Chittoor : MLA Komatireddy Visits Tirumala Srivaru

తిరుమల : నల్లగొండ ఎంఎల్‌ఎ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 2019లో అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పాలకులు తప్ప ప్రజలు సంతోషంగా లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.