Home తాజా వార్తలు అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యం

అభివృద్ధి, సంక్షేమం తెరాసతోనే సాధ్యం

Manchireddy Kishan Reddyస్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి … తెరాసలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపిపి పి. కృపెష్‌తో 300 మంది చేరిక

ఇబ్రహీంపట్నం: అభివృద్ది సంక్షేమం టిఆర్‌ఎస్ వల్లనే సాధ్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపిపి పి. కృపెష్ , యాచారం మండలంలోని మాల్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సందానీ తో పాటు సుమారు 300 మంది తెరాసలోకి గులాభీ జెండాను మెడలో వేసి స్వాగతించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… అభివృద్ది , సంక్షేమం టిఆర్‌ఎస్ వల్లనే సాద్యమని ఎమ్మెల్యే అన్నారు. గత పాలకుల వల్లనే తెలంగాణ అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. కేసిఆర్ చొరవతోనే తెలంగాణ ప్రగతి సాదించిందని గుర్తు చేశారు. హరితా తెలంగాణకావాలంటె తెరాసను గెలిపించాలని అన్నారు.

సంక్షేమం, అభివృద్దితోనే తెరాసలోకి మాజీ ఎంపిపి కృపెష్ ….

సంక్షేమం, అభివృద్ది తెలంగాణ తోనే సాద్యమని మాజీ ఎంపిపి కృపెష్ అన్నారు. కేవలం అభివృద్ది కోసమే తెరాసలో చేరడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ గోతిలో నక్కలాగా తయారైందని అన్నారు. ఎమ్మెల్యే సహాకారాలతో మరింత అభివృద్ది చేసుకోవాడానికి తెరాసలో చేరామన్నారు. సీనియర్ తెరాస నాయకులు క్యామా మల్లేష్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లోనే రాష్ట్రం అదోగతి పాలైందని అన్నారు. అందుకే తెరాసలో చేరడం జరిగిందని చెప్పారు.

ఈ కార్యాక్రమంలో సర్పంచ్ అరుణ నరెందర్‌గౌడ్ , ఉప సర్పంచ్ భగీరథ, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు క్రిష్ణ , శ్యాం సుందర్‌రెడ్డి , మాజీ సర్పంచ్ ప్రభాకర్‌గౌడ్ , మస్తాన్ , రమేష్ కిషన్, రాంరెడ్డి , బాల మల్లేష్ , ఐలయ్య, రాములు , జైపాల్‌రెడ్డి , మైపాల్‌రెడ్డి , నరేందర్, రాజు , భాను , నర్సింహ్మా, ఇబ్రహిం, బాబులు , జంగయ్య , కిష్టయ్య , క్రిష్ణ గౌడ్ , నర్సింహ్మా గౌడ్ , జంగయ్య, యాచారం నాయకులు సందాని , ఆయన సోదరులు గులాం ఇస్రత్ , కానమోని సచిత, బారతమ్మ, పర్వత్‌రెడ్డి , చంద్రయ్యతోపాటు సుమారు 200 మంది తెరాసలో చేరారు.

MLA Manchireddy Kishan Reddy Speech