Home వరంగల్ రూరల్ బంగారు తెలంగాణ వైపు అడుగులు

బంగారు తెలంగాణ వైపు అడుగులు

MLA Sathish kumar Speech About Telangana devlopments

మన తెలంగాణ/ ఎల్కతుర్తి : పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వడివడిగా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందని హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ అన్నారు. మండలంలోని పెంచికలపేట్ గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గ్రామంలో రూ. 16లక్షలతో గ్రామపంచాయతీ నూతన భవనానికి, రూ. 10లక్షతో నిర్మించే స్మశాన వాటికకు ఎమ్మెల్యే చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 10లక్షలతో సీసీ రోడ్డు పనులను, ధర్మబావి నుంచి దుగ్యాని కొంరయ్య ఇంటి వరకు, పెంచికలపేట్ నుంచి కాట్రపల్లి మొరం రోడ్డుకు రూ. 10 లక్షలతో నిర్మించే పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజల కోసం అహర్ణిషలు పని చేస్తున్నారని, ఆయన నేతృత్వంలో పని చేయడం ఆనందంగా ఉందన్నారు. తన నియోజకవర్గంలో సుమారు రూ. 5వేల కోట్లతో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయగలిగానని, ఈ నాలుగేళ్ల కాలం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఇదేవిధంగా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట ఎంపీపీ శాలిని, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ దుగ్యాని సమ్మయ్య, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.