Home ఆఫ్ బీట్ ఆది నుంచి వివాదాల శంకర్ నాయక్

ఆది నుంచి వివాదాల శంకర్ నాయక్

                        Shanker-Naik

హైదరాబాద్: తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్న చందంగా మహబూబాబాద్ శాసనసభ్యుడు శంకర్ నాయక్ వ్యవహరిస్తున్న తీరే ఆ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనాకు మధ్య పొరపొచ్చాలకు ఆస్కారం ఏర్పడిందని చెపుతున్నారు. ఎంఎల్‌ఎ శంకర్ నాయక్ ప్రతిసారి కలెక్టర్ ను కలిసిన సందర్భంలో తాను చెప్పిన పనులు చేయాల్సిందేనంటూ వత్తిడి తెచ్చేవాడని తెలుస్తుంది. పరిపాలనా సౌలభ్యం మేరకే తాను పనులు చేస్తానని కలెక్టర్ చెప్పినా వినకుండా  అవే పనులకోసం వత్తిడి పెంచు తూవచ్చేవాడని తెలుస్తుంది. వాస్తవానికి శంకర్‌నాయక్ పై వస్తున్న పలు అవినీతి ఆరోపణల మూలంగానే కలెక్టర్ శంకర్ నాయక్ చెప్పిన పనులపై కలెక్టర్ అంతగా దృష్టి సారించనట్లు చెపుతున్నారు .మహబూ బాబాద్ మండలం అనంతారం గ్రామ గుట్టపై వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించి ఆ గుట్టచుట్టూ ఉన్న భూములు ఖబ్జా చేసేందుకు ప్రయత్నం చేశాడన అభియోగాలు ఉన్నాయి.

గుడికి వెళ్లడం కోసం ఒక రైతు భూమి గుండా రోడ్డు వేయడంతో మనస్థాపానికి గురైన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో సదరు రైతుకు కొంత మొత్తాన్ని ముట్టజెప్పి సయోధ్య చేసుకున్నట్లు సమాచారం. ఏటిగడ్డతండాకు రోడ్డు పక్కనే ఉన్న ఎసైండ్ భూమిని మాజీ వార్డు మెంబర్, సిపిఎం నేత అయిన సీతారాం నాయక్  హక్కుభుక్తాల్లో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఈ భూమిపై కన్నేసిన శంకర్ నాయక్ దాన్ని ఖబ్జాచేసే ప్రయత్నం చేశారని కూడా ఆరోపణలు ఉన్నా యి.

టిఆర్‌ఎస్‌లో అతి పెద్ద నేత తనకు అండదండగా ఉన్నారని చెప్పు కుంటూ తన చిత్తం వచ్చినట్లు వ్యవహరించేవాడన్న అభియోగాలు ఉన్నాయి. ఈ దశలో కలెక్టర్ సయితం తాను చెప్పిన పనులు చేయా ల్సిందేనని లేకపోతే శంకరగిరి మాన్యాలు పట్టిస్తానంటూ పలువురి వద్ద చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ తత్వంతోనే మహిళా కలెక్టర్ అన్న విషయాన్ని కూడా మరిచి ఆమెపై చేతులు వేసి అవమానించే స్థితి వచ్చిందని చెపుతున్నారు. గుడికి సంబంధించిన భూమి ఖబ్జా విషయంలోనూ ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈయనతో ఉన్న తల నొప్పులతో రేపోమాపో పార్టీనుంచి సాగనంపుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.