Home జాతీయ వార్తలు శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్‌గౌడ్

శ్రీవారిని దర్శించుకున్న శ్రీనివాస్‌గౌడ్

MLA Srinivas Goud Visited Tirumala Srivaru

తిరుమల : మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం స్వామివారికి జరిగిన అభిషేక సేవలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారికి మొక్కులు చెల్లించు కున్నారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం, శ్రీవారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్టు ఆయన తెలిపారు.

MLA Srinivas Goud Visited Tirumala Srivaru