Home తాజా వార్తలు ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ ప్రారంభం

MLC Electionsహైదరాబాద్ : తెలంగాణలో పట్టభద్రుల ఎంఎల్ సి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం, కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌; వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గాలకు పోలింగ్‌ జరుగుతుంది. పట్టభద్రులు, టీచర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని పోలీంగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనున్నది. అధికారులు ప్రతి వెయ్యిమంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌- మెదక్‌- నిజామాబాద్‌- ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 472 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 185 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

MLC Elections Polling Start on Friday Morning