Home తాజా వార్తలు సిరిసిల్లలో ఎంఎల్‌సి ఎన్నికల్లో శిక్షణ

సిరిసిల్లలో ఎంఎల్‌సి ఎన్నికల్లో శిక్షణ

MLC Elections Training

 

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో రానున్న ఎంఎల్‌సి ఎన్నికలకు 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఐదు కేంద్రాలు పూర్తిగా గ్రాడ్యుయేట్లకు ప్రత్యేకం కాగా, తొమ్మిది కేంద్రాల్లో గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులకు కంబైండ్‌గా ఏర్పాటు చేశారు. బుధవారం ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులకు సిరిసిల్లలోని ఆర్‌డిఓ కార్యాలయంలో శిక్షణను పూర్తి చేశారు. శిక్షణలో ఎన్నికల నియమాలు, ఓటింగ్ విధానం, అధికారుల విధులు, ఏజంట్ల నియామకం, బ్యాలెట్ వినియోగం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏమేమి చేయాలి, రిసెప్షన్ సెంటర్‌లో ఏవేవి పంపిణీ చేయాలో తదితరాలను శిక్షణ అధికారులు నరేందర్, పాతూరి మహేందర్‌రెడ్డి, కడార్ల సూర్యనారాయణలు వివరించారు.

Training to MLC Election Presiding officers in Siricilla