వికారాబాద్: కొండగల్ నియోజకవర్గంలో శనివారం టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్ఎల్ సి పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కొడంగల్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ శ్రేణులు, యువకులు కొడంగల్‌కు భారీగా తరలివచ్చి భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు టిఆర్ఎస్వైపే ఉన్నారని చెప్పారు. రాబోవు ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.