Search
Thursday 15 November 2018
  • :
  • :

కర్ణాటకలో పోలీస్‌స్టేషన్‌ను ధ్వంసం చేసిన స్థానికులు

Police-station

బెంగళూరు: పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతిచెందడంతో ఆగ్రహించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌పై దాడిచేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని లక్ష్మెష్వర్‌లో చోటుచేసుకుంది. ఇసుక మాఫియా విషయంలో ఓ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉన్నాడు. కాగా ఆయన పోలీస్ స్టేషన్‌లోనే చనిపోయాడు. దీంతో పోలీసులే లాకప్‌డేత్ చేశారంటూ స్థానికులు ఆగ్రహించి పోలీస్ స్టేషన్‌ను ధ్వంసం చేశారు. అలాగే స్టేషన్‌కు సంబంధించిన వాహనానికి నిప్పంటించారు. దీంతో లక్ష్మెష్వర్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు వెంటనే అదనపు రక్షణ బలగాలను మోహరించారు.

Comments

comments