Home జాతీయ వార్తలు జేబులో పేలిన మొబైల్ ఫోన్: వృద్ధుడి సజీవదహనం!

జేబులో పేలిన మొబైల్ ఫోన్: వృద్ధుడి సజీవదహనం!

Mobile Phone Blastరాజస్తాన్: జేబులో ఫోన్ పేలి, మంటలు అంటుకుని ఓ వృద్దుడు సజీవదహనం అయిన విచిత్ర ఘటన రాజస్తాన్ లోని నెతావల్ గఢ్ లో చోటు చేసుకుంది. ఒకటి చేద్దాం అనుకుంటే… మరోకటి అవ్వడం అంటే ఇదే కాబోలు. చవకగా ఫోన్లు అందజేసి ప్రజల మద్దతును పొందాలని అనుకున్న రాజస్తాన్ సర్కార్ కు ఈ దెబ్బతో షాక్ తగిలింది. ఫోన్ పేలడం ఎంటీ..? దానికి కారణం ప్రభుత్వం ఏంటీ అనుకుంటున్నారా? ఈ ఘటనకు కారణం ప్రభుత్వం అందజేసిన  ఫోన్ కావడమే.

రాజస్తాన్ లోని పాచ్లీ గ్రామంలో ఓ పెద్దాయన ఇటీవల రాజస్తాన్ సర్కార్ రూ.1100 కు అందజేసిన ఫోన్ ను కొనుగోలు చేశాడు. అయితే, ఈ ఫోన్ ను బనియన్ జేబులో పెట్టుకుని శుక్రవారం రాత్రి బయటకు పోతుండగా… ఫోన్ బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వృద్ధుడు మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Mobile Phone Blast in Shirt Pocket At Rajasthan