Home హైదరాబాద్ మోడల్ మార్కెట్ ప్రారంభం మరిచిన అధికారులు

మోడల్ మార్కెట్ ప్రారంభం మరిచిన అధికారులు

School-image

వంద రోజుల ప్రణాళికకు అధికారుల తూట్లు ముస్తాబై రెండేళ్లు గడిచినా ప్రారంభంకాక శిథిలావస్థకు చేరుకున్న మార్కెట్ అధికారుల ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి రూ.50లక్షల ప్రజా ధనం వృధా అధికార పార్టీపై మండిపడుతున్న ప్రతిపక్షాలు, ప్రజలు

మన తెలంగాణ/కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ సకాలంలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మాటలను పెడచెవిన పెడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుతో అధికార పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షాల ముందు, ప్రజల ముందు తలదించుకోవాల్సి వస్తుంది. ఒక ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలనే దృఢ విశ్వాసంతో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్, గ్రేటర్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే పట్టుదలతో పని చేస్తున్న మంత్రి కెటిఆర్‌కు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించక పోవడంతో అభివృద్ధి కుంటుపడుతుంది.

అందులో భాగంగా కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన పాపిరెడ్డినగర్, ప్రగతీనగర్, హనుమాన్‌నగర్, దీనబందుకాల నీ, ఆస్‌బెస్టాస్ కాలనీల్లో జరుగుతున్న పనుల జాప్యంతో స్పష్టమవుతుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ల మధ్య సఖ్యత లేకనే పనులు ఆలస్యమవుతున్నాయని విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు. మంత్రి కెటిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమై 100 రోజుల ప్రణాళికకు అధికారులు, ప్రజాప్రతినిధులు తూట్లు పొడుస్తున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన భవనాలు ప్రారంభం కాకముందే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రగతీనగర్ ఈ-సేవ గ్రౌండ్‌లో 100 రో జుల ప్రణాళికలో భాగంగా 4-11-2015న ఎంతో హడావిడిగా శిలాపలకాన్ని వేసి నిర్మా ణ పనులు ప్రారంభించిన మోడల్ మార్కెట్ రెండేళ్లయినా ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది.

ముస్తాబైన మోడల్ మార్కెట్‌ను ప్రారంభించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ పట్టించుకోక పోవడంతో అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారిన మోడల్ మార్కెట్‌లోని విద్యుత్ పరికరాలను పలువురు ఆకతాయిలు ధ్వంసం చేయగా మరికొన్ని చోరీలకు గురయ్యాయి. లక్షలాది నిధులతో నిర్మించిన భవనాన్ని కాపాడాల్సిన బాధ్యతను మరిచిన ప్రజాప్రతినిధుల తీరుతో ప్రజలు మం డిపడుతున్నారు. ప్రజాధనానిన్ని వృధా చేస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు కోట్లకు పడగలెత్తుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పిల్లలు ఆడుకునే స్ధలంలో వద్దన్నా వినకుండా మోడల్ మార్కెట్‌ను నిర్మించి వాడుకోకుండా చేసారని పలువురు అధికార పార్టీ నాయకులు వివిధ శాఖల మంత్రులకు వినతులనందించి పనులను నిలి పి వేయాలని కోరినా వినకుండా నిర్మించిన మోడల్ మార్కెట్‌ను సకాలంలో ప్రారంభించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు.

ప్రజాధనాన్ని వృధా చేస్తున్న ప్రభుత్వం : చిరుమర్తి
కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడడం లేదు. ప్రకటనలో మభ్యపెడుతున్న ప్రభుత్వం ఆచరణలో శూన్యం. 100 రోజు ల ప్రణాళికలతో భాగంగా నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ నిర్మాణం అధికారులకు, కాంట్రాక్టర్లకు, ప్రజాప్రతినిధుల జేబులు నింపుతూ అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. రోజూ డివిజన్ అభివృద్ధి అంటూ చక్కర్లు కొట్టే ప్రజాప్రతినిధికి మోడల్ మార్కెట్ ప్రారంభించాలన్న ధ్యాస పుట్టకపోవడం శోచనీయమన్నారు. వెంటనే మోడల్ మార్కెట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా హెచ్చరించారు.