Home తాజా వార్తలు మోడీ, అమిత్‌షా ఉచ్చులో చిక్కుకున్న బాబు: జెసి

మోడీ, అమిత్‌షా ఉచ్చులో చిక్కుకున్న బాబు: జెసి

MP-JC

విజయవాడ: ఎంపిల రాజీనామాలు, లోక్ సభలో అవిశ్వాస తీర్మానాలతో ఎపికి ఒరిగేదేమీలేదని టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్రం నుంచి టిడిపి బయటికి రావాలని ఆంధ్రా ప్రజలు కోరుకుంటున్నారని, తాము బయటికి వచ్చినా కేంద్ర ప్రభుత్వం పడిపోదన్నారు. వైసిపి నేత జగన్ మోహన్ రెడ్డి ఓ ఎంపితో రాజీనామా చేయించమనండి తాను చేస్తానని, ఎవరో గెలుస్తారో చూద్దామని సవాలు విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉచ్చులో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు చిక్కుకున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామంటే పెద్దమనిషి కాబట్టి ఒప్పుకున్నారని వెల్లడించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తులుచుకుంటేనే ఏమైనా జరుగుతుందన్నారు. పార్లమెంటులో ఎపి కోసం ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు.