Home స్పెషల్ ఆర్టికల్స్ తోడు దొంగలు

తోడు దొంగలు

  • మోడీ, కెసిఆర్‌పై దిగ్విజయ్‌సింగ్ ధ్వజం
  • నోట్ల రద్దు కార్డుల కంపెనీల కోసమే
  • బిజెపికి ఎంఐఎం పరోక్ష మద్దతు
  • నిజామాబాద్‌లో జన ఆవేదన సమ్మేళన సభను ప్రారంభిస్తూ ఆరోపణ

Digvijay-Singhనిజామాబాద్ : కేంద్రంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో కెసిఆర్ కుమ్మక్కై ప్రజాధనాన్ని దోపిడీ చేస్త్తూ, ప్రజలకు అబద్దాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై కాంగ్రెస్ పార్టీ తెలం గాణ రాష్ట్రంలో నిర్వహించే జన ఆవేదన సమ్మేళన సభ ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా హాజరైన దిగ్విజయ్‌సింగ్ మాట్లాడుతూ నవంబర్ 8, 2016న పెద్ద నోట్ల రద్దు తర్వాత మోడీ నోట్ల సెట్టింగ్ పిఎం గా మారిపోయారన్నారు. నోట్లు రద్దు చేస్తే కెసిఆర్‌కు భయం పుట్టి హడావిడిగా ఢిల్లీలో మోడీని కలిసి నోట్ల సెట్టింగ్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కెసిఆర్ ఇద్దరూ పెద్ద అబద్ధాల కోరులని, ప్రజలను మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నార న్నారని విమర్శించారు. రూ.500, 1000 నోట్లను రద్దు చేసి దేశాన్ని 50 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని మండిపడ్డారు. నోట్లను రద్దు చేసి, నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలకు, నకిలీనోట్లకు,తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డు కట్ట వేస్తామని, చివరకు రూపాయికార్డు, మాస్టర్ కార్డు, పేటిఎం, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కంపెనీలకు లాభాలు చేకూర్చారని అన్నారు. దేశంలో కొంత మంది బడా వ్యాపారులకు లాభాలు చేసేందుకు 120 కోట్ల ప్రజలను మోడి మోసం చేసారన్నారు. నోట్ల రద్దు తర్వాత యాభై రోజుల్లో నల్లధనం చెత్త కుప్పల్లో దొరుకుతుందని, చిత్తు కాగితాలు అవుతాయని చెప్పిన మోడీ ఇప్పు డు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై రోజుకోక మాట చెప్పిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం చెప్పాల్సిన అవస రం ఉందన్నారు. సాక్షాత్తు ఆర్‌బిఐ గవర్నర్ లెక్కలు చెప్పకపోవడంపై ఎద్దేవా చేసారు. పెద్ద పెద్దొళ్లు బ్యాంకుల్లో క్యూ కడతారని చెప్పిన మోడీ, కోట్ల మంది పెద్దలను బ్యాంకుల చుట్టూ తిప్పారన్నారు. కాని మోడీ చెప్పిన నల్లధనం, నకిలీనోట్లు ఎమయ్యాయో ఇప్పటికైనా లెక్కలు తేల్చాలని అలాగే పెద్ద పెద్ద వ్యాపారులు, కాంట్రాక్టర్ల వద్ద కొత్త కొత్త నోట్లు ఎలా బయటకు వచ్చాయో సమాధానం చెప్పాలన్నారు.
బీజేపితో ఎంఐఎం కుమ్మక్కు : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్, ఎంఐఎంలు బిజెపికి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారని దిగ్వి జయ్‌సింగ్ ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత కెసిఆర్ మోడీతో కలిసి నోట్ల మార్పిడీ చేసుకొని రాజకీయ ఒప్పందం చేసుకున్నారన్నారు. మైనార్టీల నాయకుడిగా ఎంఐఎం అసదుద్దీన్, 12 శాతం రిజర్వేషన్ ఇస్తామని కెసిఆర్ లు బిజెపికి మద్దతు ఇస్తున్నారని, బీహార్, గుజరాత్‌లో అమిత్‌షా ఇంట్లోనే అసదుద్దీన్ కలిసి 400 కోట్లు మార్పిడీ చేసుకున్నారని, పరోక్షంగా మైనార్టీల ఓటును బిజెపికి మద్దతు ఇచ్చేందుకు అసదుద్దీన్ ఒప్పందం చేశారన్నారు. 2019లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బిజెపి, టిఆర్‌ఎస్ ప్రభుత్వాలు పోతాయని, మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు.
నోట్ల రద్దు ఐసిఎం కోసమే -కుంతియా : దేశంలో నోట్ల రద్దు ఇంటర్నేషనల్ కార్డు మాఫియా (ఐసిఎం) కోసమే జరిగిందని ఎఐసిసి కార్యదర్శి చందర్ కుంతియా అన్నారు. దేశాన్ని ఆర్థికంగా శాసించే బడా వ్యాపారుల కోసం నోట్లను రద్దు చేస్తే జిడిపి రేటు ఒక్క శాతం తగ్గింది. 1.25 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 15 కోట్ల మంది ఉపాధి కూలీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ మోడీతో కుమ్మ క్కై ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తెలంగా ణ ప్రజల అక్షాంక్షల మేరకే సోనియాగాంధీ తెలం గాణ రాష్ట్రం ఇచ్చారని, ఇది కెసిఆర్ సొత్తు కాదన్నా రు. నోట్ల రద్దు తర్వాత దేశం ఆర్థిక పరిస్థితితో పాటు వ్యాపారులలో, ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నారు.
అబద్దాల కోరు కెసిఆర్ : ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసేందుకు కెసిఆర్ అబద్ధాలు ఆడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా కాంగ్రెస్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు రుణా మాఫీ చేయకుండా జాప్యం చేస్తున్నారని విమర్శిం చారు. 3200 కాలేజీలో 14 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్స్, ఉపకార వేతనాలు లేవని, 2.50 లక్షల మందికి వేతనాలు లేవన్నారు. రైతులు, నిరుద్యోగులు, యువత, మహిళలకు ఎలాంటి సబ్సిడీ రుణా లు అందడం లేదని, రోజుకొక పిట్టకథ చెబుతూ కెసిఆర్ కాలం వెళ్లదీస్తున్నారన్నారు. వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటా మని అసెంబ్లీ సాక్షిగా వింత సాకులు చెబుతున్నారన్నారు. అలాగే నిజామా బాద్ జిల్లాలో కాంగ్రెస్ హయంలోనే తెలంగాణ యూనివర్శిటీ, మెడికల్ కాలేజీ, డైరీ కాలేజీలు ఏర్పాటు చేస్తే ఇంత వరకు వాటి అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని, కనీసం ఒక్క నియామకం కూడా చేయలేదని విమర్శించారు. గల్ఫ్‌లో చనిపోతే శవాన్ని తీసుకురావడానికి 4 నుంచి 5 నెలలు పడుతుం దన్నారు. టిఆర్‌ఎస్‌కు జిల్లాలో తగిన గుణపాఠం చెప్పాలని, గ్రామ గ్రామా నా టిఆర్ ఎస్ చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు విసృత్తంగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం శాసన సభ ప్రతిపక్ష నేత జానారెడ్డి, శాసన మండలి పక్షనేత షబ్బీర్ అలీ, మాజీ ఎంపి మధుయాష్కి, పిసిసి మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు మాట్లాడారు.