Home అంతర్జాతీయ వార్తలు మోడీ, షరీఫ్ హాయ్ హాయ్!

మోడీ, షరీఫ్ హాయ్ హాయ్!

modiఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి సమావేశాలకు పాల్గొనేందుకు వెళ్లిన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్‌లు ఇద్దరూ ఇరువైపుల ఉండి చేతులు ఊపుకున్నారు. వీరిరువురు ఒకే హోటల్‌లోనే బస చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలలో వారి ద్దరు కలుసుకొని మాట్లాడుకుంటారని, చేతులు కలిపి షేక్‌హాండ్ ఇచ్చుకుంటారని ఎంతో కాలం గా అందరూ ఎదురుచూశారు. కానీ, అలాంటిది ఏమి జరుగలేదు. మొదటిగా, ప్రధాని మోడీ సమావేశ హాలులోకి ప్రవేశించారు. కొద్ది సమ యానికి వచ్చిన షరీఫ్ మోడీ వైపు చూచి చేతులు ఊపి, నవ్వారు. మోడీ కూడా చేతులు ఊపి అం దుకు బదులుగా నవ్వారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆశక్తికరంగా కొట్టిపారేసింది. ప్రధాని మో డీ, షరీఫ్‌లు ఒకే హోటల్ వోల్డార్ఫ్ ఆస్టోరియా ఉన్నప్పటికీ వారు కలుసుకోలేదు. రష్యాలోని ఉఫాలో జులైలో ఆఖరుసారి సమావేశమయ్యా రు. ఇరువురి మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగు తాయన్న విషయంపై భారత అధికారులు కొట్టి వేశారు. అయినప్పటికీ, ఇరు దేశాల నాయకులు కనీసం చేతులు కలుపుతారనే నమ్మకం ఉండేది.
కాగా, ప్రధాని మోడీ ఐర్లాండ్, అమెరికా రెండు దేశాల పర్యటనను ముగించుకొని భారత్‌కు తిరు గు ప్రయాణమయ్యారు. ‘నా అమెరికా పర్యట నలో ఎంతో బలీయమైన, భిన్నత్వ స్నేహబం ధాన్ని ప్రదర్శించడం జరిగింది. కొద్ది రోజులలోనే ఎన్నో అంశాలపై అనేక విషయాలు తెలుసు కోవడం జరిగింది’ అని మోడీ తిరుగు ప్రయా ణానికి ముందు ట్వీట్ చేశారు. ‘నేను ఎన్నో కార్య క్రమాలకు హాజరయ్యేందుకు అవకాశం కలి గింది. ఈ కార్యక్రమాలు ద్వారా భారతదేశానికి ఎంతో మేలు జరిగి సత్ఫలితాలు నిస్తాయి’ అని ట్వీట్‌లో తెలిపారు. ప్రపంచ దేశాలతో భారత సంబంధాలను బలపరచేందుకు అనేక మంది దేశ నాయకులతో కలిశాను. అనేక ప్రధాన అంశాలను నాయకులతో పంచుకునే అవకాశం నాకు కలిగిందని తెలిపారు. ‘నేను, నా బృందం ఎక్కడికి వెళ్లినా ఎంతో ఆదరాభిమానంతో ఘనం గా ఆహ్వానించి నందుకు అమెరికా ప్రజలకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని అన్నారు.