Home జాతీయ వార్తలు మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక మోడీ : రాహుల్

మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక మోడీ : రాహుల్

Modi behind Great escape from Mallya

న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలపైగా ఎగ్గొట్టిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా… ప్రస్తుతం విదేశాల్లో తల దాచుకుంటున్నాడు. అయితే, మాల్యా దేశం విడిచి వెళ్లిపోవడానికి ప్రధాని మోడీ సాయం చేశారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల గాంధీ ఆరోపించారు. దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రుణం టోపి పెట్టి, బ్రిటన్‌కు వెళ్లేముందే దేశ ఆర్థిక మంత్రి జైట్లీకి చెప్పినట్టు ఇటీవల విజయ్ మాల్యా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై శుక్రవారం రాహుల్ గాంధీ మళ్లీ ట్విట్టర్ లో స్పందించారు.  మాల్యా గ్రేట్ ఎస్కేప్ వెనుక సిబిఐతో పాటు మోడీ కూడా ఉన్నారని రాహుల్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధాని సంకేతాల మేరకు సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. సిబిఐ నేరుగా  మోడీకి మాత్రమే రిపోర్ట్ చేస్తుందన్నారు. కానీ ఈ కేసులో సిబిఐ అలా ఎలా వ్యవహరించిందో అర్థం కావడం లేదని రాహుల్ పేర్కొన్నారు. మోడీ కనుసన్నల్లోనే సిబిఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. సిబిఐ మొదట డిటెన్షన్ నోటీసును ఇచ్చిందని, కానీ ప్రధాని మోడీ ఆదేశాలతో ఆ నోటీసు కాస్తా లుకౌట్‌గా మారిందని తీవ్రంగా ఆరోపించారు. 2015 అక్టోబర్ 16వ తేదీన సిబిఐ విజయ్ మాల్యాకు నోటీసులు  జారీ చేసింది. నవంబర్ 24న మరో నోటీసు ఇచ్చింది. డిసెంబర్ 9,10,11 తేదీల్లో మాల్యాను విచారించామని సిబిఐ వెల్లడించింది. కానీ ఆయన మళ్లీ దేశానికి రారన్న విషయాన్ని గ్రహించలేకపోయామని సిబిఐ పేర్కొంది.