Home తాజా వార్తలు హరివంశ్ మంచి విద్యావంతుడు: ప్రధాని

హరివంశ్ మంచి విద్యావంతుడు: ప్రధాని

Modi-vs-Harivamshi-Singlh

ఢిల్లీ: డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. గురువారం ప్రధాని రాజ్యసభ  మాట్లాడారు. హరివంశ్ మంచి విద్యావంతుడన్నారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్ ఎంతో స్ఫూర్తి పోందారని పేర్కొన్నారు. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి చిత్తశుద్ధి, విలువలతో కూడి ప్రజాసేవ చేస్తున్నారని తెలిపారు. హరివంశ్‌పై పూర్తి విశ్వాసం ఉందని, చాలా ఏళ్లుగా సమాజ సేవలో ఉన్నారని మెచ్చుకున్నారు. హరివంశ్‌కు సభను హుందాగా నిర్వహించే సమర్ధత ఉందన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్‌డిఎ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ 20 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం ఉదయం జరిగిన ఈ ఎన్నికల్లో హరివంశ్‌కు 125 ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాల కాంగ్రెస్ నేత హరిప్రసాద్‌కు 105 కోట్లు వచ్చాయి.