Home జాతీయ వార్తలు రష్యా పర్యటనకు ప్రధాని

రష్యా పర్యటనకు ప్రధాని

Modi-With-Putinఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని రష్యాకు బుధవారం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. వ్యాపార రంగాలు, రక్షణ, హైడ్రోకార్బన్, అణుశక్తి, తదితర అంశాల పై వారు చర్చలు జరపనున్నారు. గురువారం సమావేశాల అనంతరం ఇరు దేశాలు ఒప్పంద పత్రాల పై సంతకాలు చేయనున్నాయి.  2000 సంవత్సరం నుంచి రష్యా, భారత్‌లు ఓ ఏడాది మాస్కోలో, ఓ ఏడాది న్యూదిల్లీలో ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నాయి.