Home తాజా వార్తలు ఐక్యమత్యంతో ఉండి దేశాన్ని రక్షించుకోవాలి

ఐక్యమత్యంతో ఉండి దేశాన్ని రక్షించుకోవాలి

Fuel-Price-Hike

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిప్పులు చెరిగారు. ప్రజా పాలనలో ఎన్ డిఎ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు భారత్ లో ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ… బిజెపి ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసి అక్రమంగా పరిమితులును అక్రమించిందని మండిపడ్డారు. దేశం ప్రజలకు అవసరమైన పనులను మోడీ ప్రభుత్వం చేపట్టలేకపోయిందని దుయ్యబట్టారు. రైతులను ఆదుకోవడంలో మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. పత్రిపక్షాలు ఐక్యమత్యంతో ఉండి శాంతియుతంగా దేశాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. భారత దేశంలో ప్రజాస్వామ్యం కాపాడేందుకు అందరం ఏకతాటిపైకి రావాలని ప్రతిపక్షాలను కోరారు.